Share News

అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరికలు

ABN , Publish Date - Jan 24 , 2026 | 11:04 PM

మంచిర్యాల నియోజకవ ర్గంలో చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి వందలాది మంది కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు.

అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరికలు

ఫఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు

మంచిర్యాలక్రైం, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల నియోజకవ ర్గంలో చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి వందలాది మంది కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులకు ఓటు అడిగే హక్కుఅర్హత లేదన్నారు. మంచిర్యాల పట్ట ణంలోని పద్మనాయక హాల్‌లో శనివారం ముఖ్య కార్యకర్తల సమావేశం లో వారు మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా మంచిర్యాల లో అండర్‌గ్రౌండ్‌ ఎలక్ర్టిసిటి సిస్టమ్‌ను త్వరలో ఏర్పాటు చేస్తున్నామ న్నారు. సింగరేణి స్థలాల్లో నివసిస్తున్న కార్మిక కుటుంబాలకు శాశ్వత ఇ ళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. మంచిర్యాల 282 పాఠ శాలల్లో విద్యా వ్యవస్థను ఆధునీకరిస్తున్నామన్నారు. దీని కోసం 150 కో ట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో తాగునీరు, సాగునీరు, మౌలిక సదుపాయాలకు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. 600పడకలతో ప్రభుత్వ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. దండేపల్లి, లక్షెట్టి పేట, మోదెల, ద్వారాక, గుడిరేవు, గూడెం గ్రామాల్లో 74.40 కోట్లతో 4 మిని లిఫ్ట్‌ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. అభివృద్ధి పనులతో ప్రజలు 60కి 60 స్థానాలను కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేషన్‌లో గె లుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 75 సంవత్సరాల్లో చేయని అభివృద్ధి ని మంచిర్యాల నియోజకవర్గం పనులు శరవేగంగా జరుగుతున్నాయని కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, తాజామాజీ నాయకులు, కార్యక ర్తలు, తదితరలు పాల్గొన్నారు.

Updated Date - Jan 24 , 2026 | 11:04 PM