ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రించాలి
ABN , Publish Date - May 24 , 2026 | 04:59 AM
ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఎం తెలంగాణ ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు.
సీపీఎం తెలంగాణ కార్యదర్శి జాన్ వెస్లీ
న్యూఢిల్లీ, మే 23 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఎం తెలంగాణ ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలని కోరారు. శనివారం ఇక్కడ సీపీఎం కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఫ్యూచర్ సిటీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పేదల భూములను గుంజుకుంటోందని, ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సీపీఎం పోరాడుతుందని చెప్పా రు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యాన్ని పూ ర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ధాన్యం తడిసిపోతే దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై జనసేన పార్టీ పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని సూచించారు.