Share News

పెళ్లి నాడే అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య

ABN , Publish Date - Feb 23 , 2026 | 02:09 AM

మరికొద్ది గంటల్లో పెళ్లి కుమార్తెలుగా కల్యాణవేదికపై కూర్చోవాల్సిన అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకోవడం రాజస్థాన్‌లో కలకలం కలిగించింది.

పెళ్లి నాడే అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య

జోధ్‌పూర్‌, ఫిబ్రవరి 22: మరికొద్ది గంటల్లో పెళ్లి కుమార్తెలుగా కల్యాణవేదికపై కూర్చోవాల్సిన అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకోవడం రాజస్థాన్‌లో కలకలం కలిగించింది. జోధ్‌పూర్‌ జిల్లా మనాయ్‌ గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు శోభ (25), విమల (23)లకు శనివారం వివాహం చేయడానికి అన్ని సన్నాహాలు జరిగాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు కుటుంబ సభ్యులు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. వారిద్దరు కూడా అప్పటివరకు అక్కడే ఉన్నారు. అనంతరం గదిలోకి వెళ్లి నిద్రపోయారు. వేకువజాము నాలుగు గంటలకు చూడగా వారి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణిస్తున్నట్టు కనిపించింది. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే వారు మరణించారు. పోస్టుమార్టం రిపోర్టులో విషం తాగినట్టు తేలింది. ఆత్మహత్యకుగల కారణాలు తెలియరాలేదు.

Updated Date - Feb 23 , 2026 | 02:09 AM