Share News

kumaram bheem asifabad- జోడేఘాట్‌.. అభివృద్ధికి దూరం

ABN , Publish Date - Oct 24 , 2026 | 10:47 PM

ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన వీరుడు.. జల్‌, జంగల్‌, జమీన్‌ నినాదంతో గిరిజనుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడు కుమరం భీం పోరుగడ్డ కెరమెరి మండలం జోడేఘాట్‌ అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఆయన పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ సోమవారం 86వ వర్ధంతిని అధికారికంగా నిర్వ హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయాలు, ఆదివాసీల హక్కుల గురించి పాలకులు, ప్రజాప్రతినిధులు ప్రస్తావిస్తున్నప్పటికీ.. భీం పోరాటం సాగిన గ్రామాల్లో మాత్రం నేటికీ కనీస వసతులు అందని ద్రాక్షగానే మారాయి.

kumaram bheem asifabad- జోడేఘాట్‌.. అభివృద్ధికి దూరం
లోగో

- అసంపూర్తి రోడ్డుపై రాకపోకలకు అవస్థలు

- అటవీ అనుమతులు లేక నిలిచిన పనులు

ఆసిఫాబాద్‌/కెరమెరి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన వీరుడు.. జల్‌, జంగల్‌, జమీన్‌ నినాదంతో గిరిజనుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడు కుమరం భీం పోరుగడ్డ కెరమెరి మండలం జోడేఘాట్‌ అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఆయన పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ సోమవారం 86వ వర్ధంతిని అధికారికంగా నిర్వ హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయాలు, ఆదివాసీల హక్కుల గురించి పాలకులు, ప్రజాప్రతినిధులు ప్రస్తావిస్తున్నప్పటికీ.. భీం పోరాటం సాగిన గ్రామాల్లో మాత్రం నేటికీ కనీస వసతులు అందని ద్రాక్షగానే మారాయి. రహదారులు అధ్వానంగా ఉండడంతో గిరిజనులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పోరు గ్రామాలకు వెళ్లేందుకు సుమారు ఆరు కిలోమీటర్ల మేర రహ దారి నిర్మాణానికి అటవీ అనుమతులు లభించకపో వడం అభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా మారింది.

- పట్టింపు కరువు..

జల్‌, జంగల్‌, జమీన్‌ కోసం నిజాం ప్రభుత్వం తో పోరాడి అసువులు బాసిన ఆదివాసీ వీరుడు కుమరం భీం పోరుగడ్డ కెరమెరి మండలం జోడే ఫూట్‌ గ్రామంపై అధికారుల పట్టింపు కరువైంది. ఏటా భీం వర్ధంతి సందర్భంగా తాత్కాలిక ఏర్పాట్లు చేస్తుండగా, శాశ్వత రహదారి సౌకర్యంపై దృష్టి సారించడం లేదు. కెరమెరి మండలం జోడేఘాట్‌ వరకు 2015లో రూ.15కోట్లతో రెండు వరుసల రోడ్డు మంజూరు అయింది. ఈ మార్గంలో హట్టి ఘాట్‌ రోడ్డు నుంచి టోకెన్‌ మొవాడ్‌ వరకు ఆరు కిలోమీటర్ల రహదారి పనులు అటవీ అనుమతుల కారణంగా మధ్యలోనే నిలిచిపోయాయి. దశాబ్ద కా లం దాటిన ఎటువంటి ముందడుగు పడడంలేదు. నాడు జంగిల్‌ కోసం పోరాడిన గోండు వీరుడి పోరుగడ్డకు వెళ్లే రోడ్డుకే అటవీ అనుమతులు అడ్డు రావడం ఆదివాసీల్లో అసహనాన్ని కలిగిస్తోంది. జోడేఘాట్‌లో పర్యాటకుల కోసం రూ.5 కోట్ల నిధులతో కాటేజీల పనులు ఇంకా నిర్మాణ దశలోనే ఉ న్నాయి. జోడేఘాట్లో సుందరీకరణ పనులు నిలిచిపోయాయి. లోటస్‌ పాండ్‌ పిచ్చిమొక్కలతో నిండి పోయింది. ఇంక పూర్తి స్థాయిలో పోరుగ్రా మాల ప్రజలకు డబల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరు కాలేదు.

- ఆదివాసీల హక్కులు..

కుమరం భీం పోరాటం ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, స్వయం పాలన కోసం సాగింది. అడవిపై ఆధారపడి జీవించే గిరిజనులకు భూమి, నీరు, అటవీ వనరులపై హక్కులు ఉండాలని ఆయన పోరాడారు. ఆయన త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ ఏటా వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, మారుమూల ప్రాంతాలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని పాలకులు చెబుతున్నారు.అయితే వర్ధంతి కార్యక్రమాల సందర్భంగా చేసే ప్రకటనలు, హామీలు క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. భీం పోరాటంతో చారిత్రక ప్రాధాన్యం పొందిన గ్రామాల్లోనే రహదా రులు, రవాణా సౌకర్యాలు లేకపోవడం గిరిజనుల దుస్థితికి అద్దం పడుతోంది. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినా, ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన మహనీయుడి పేరు మీద జిల్లా ఏర్ప డినా.. ఆయన పోరాట ప్రాంతాల్లో అభివృద్ధి ఆశిం చిన స్థాయిలో కనిపించడం లేదని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- అధికారికంగా..

కుమరం భీం 86వ వర్ధంతి సోమవారం అధికారికంగా నిర్వహించనున్న నేపథ్యంలో పోరు గ్రామాల అభివృ ద్ధిపై మరోసారి చర్చ మొదలైంది. వర్ధంతి కార్యక్రమాలకు అధికారులు, ప్రజాప్రతిని దులు హాజరై నివాళులర్పించడంతో పాటు గ్రామా ల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు. ఆరు కిలోమీటర్ల రహదారికి అటవీ అనుమతులు సాధించి నిర్మాణ పనులు ప్రారంభించాలని, గ్రామా లకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రహదారులతో పాటు తాగునీరు, విద్య, వైద్యం వంటి కనీస వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు.కుమరం భీం ఆశయాలను కేవలం వర్ధంతి వేడుకలకే పరిమితం చేయకుండా, ఆయన పోరాటం సాగిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టినప్పుడే నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో సోమ వారం నిర్వహించనున్న వర్ధంతి సందర్భంగా పోరు గ్రామాల అభివృద్ధిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందోనని గిరిజనులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

అభివృద్ధి పనులు పూర్తి చేయాలి..

-పెందుర్‌ రాజేశ్వర్‌, ఉత్సవ కమిటీ చైర్మన్‌

జోడేఘాట్‌లో నిలిచిపోయిన అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలి. హట్టి ఘాట్‌ రోడ్డు నుంచి టోకెన్‌ మొవాడ్‌ వరకు ఆరు కిలోమీటర్ల రహదారి పనులు అటవీ అనుమతుల కారణంగా నిలిచిపో యాయి. ఉన్నతాధికారులు స్పందించి నిలిచిపోయి న పనులను చేపట్టాలి. అర్హులందరికీ డబల్‌ బెడ్‌ రూం ఇళ్లు మంజూరు చేయాలి. జోడేఘాట్‌లో పర్యటకులకు వసతులు కల్పించాలి.

Updated Date - Oct 24 , 2026 | 10:47 PM