Share News

kumaram bheem asifabad-అంగన్‌వాడీల్లో త్వరలో ఉద్యోగాల భర్తీ

ABN , Publish Date - May 30 , 2026 | 11:55 PM

అంగన్‌వాడీ వ్యవస్థ బలోపేతంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మహిళా, శివు సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్న తరుణంలో క్షేత్ర స్థాయిలో పథకాలు పక్కాగా అమలయ్యేలా చర్యలు చేపడుతోంది. కొన్నాళ్లుగా జిల్లాలోని పలు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉపాధ్యాయులు, సహాయకుల పోస్టులు ఖాళీగా ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది

kumaram bheem asifabad-అంగన్‌వాడీల్లో త్వరలో ఉద్యోగాల భర్తీ
లోగో

- మహిళలకు ఉపాధి.. కేంద్రాల బలోపేతం

- పౌష్టికాహారం, విద్య సేవలకు మరింత బలం

కాగజ్‌నగర్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ వ్యవస్థ బలోపేతంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మహిళా, శివు సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్న తరుణంలో క్షేత్ర స్థాయిలో పథకాలు పక్కాగా అమలయ్యేలా చర్యలు చేపడుతోంది. కొన్నాళ్లుగా జిల్లాలోని పలు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉపాధ్యాయులు, సహాయకుల పోస్టులు ఖాళీగా ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఇందు కు అనుగుణంగా జిల్లా సంక్షేమ శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు ఖాళీల వివరాలను ప్రభుత్వానికి పంపించింది. నిరుద్యోగ మహిళలకు త్వరలోనే ప్రభుత్వం తీపి కబురు చెప్పనుంది. ఈ ఏడాది లోపే కలెక్టర్‌ ఆధ్వర్యంలో నియామక ప్రకటన విడుదల చేసి పోస్టుల భర్తీ చేపట్టేందుకు కార్యచరణ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

- మౌలిక వసతులు..

ఖాళీల భర్తీతో పాటు పలు కేంద్రాల్లో తాగునీటి సదుపాయం, విద్యుత్‌ కనెక్షన్లు, మరుగుదొడ్లు, శాశ్వత భవనాలు, ఆర్వో ప్లాం ట్లు, ఎస్‌ఈడీ తెరల ఏర్పాటు చేపట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గతం లో అంగన్‌వాడీ కేంద్రాలు మెయిన్‌, మినీ కేంద్రాల్లో ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నా రు. ఇప్పుడు సహాయకులను కూడా నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఉపాధ్యాయ పోస్టులతో పోలిస్తే సహాయకుల ఖాళీలు అధికంగా ఉన్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు ఒక పూట సంపూర్ణ భోజనం అందిస్తున్నారు. చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య అందిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. పౌష్టికాహారం పంపిణీ ద్వారా బాలల ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తున్నారు. కానీ పదోన్నతులు, ఉద్యోగ విరమణలు, విధులకు దూరంగా ఉండడం, మరణాలు వంటి కారణాలతో ఉపాధ్యాయులు, సహాయకుల పోస్టులు ఖాళీగా మారాయి.

- ఉపాధ్యాయులు లేని చోట..

ఐదేళ్లుగా అంగన్‌వాడీల్లో ఖాళీల సంఖ్య పెరుగుతూ వస్తోంది. భర్తీ లేక పోవడంతో ఉపాధ్యాయులు లేని చోట సహాయకులతోనే కేంద్రాలను నడిపిస్తున్నారు. కొన్ని చోట్ల ఇన్‌చార్జిలతో కొనసాగించడంతో నిర్వహణపై ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాల వారిగా ఖాళీల సమాచారాన్ని ప్రభుత్వం సేకరించింది. పోస్టుల భర్తీతో పూర్వ ప్రాథమిక విద్య బలోపేతం కావడంతో పాటు పౌష్టికాహారం పంపిణీలో ఇబ్బందులు తొలగనున్నాయి. అదే సమయంలో నిరుద్యోగ మహిళలకు ఉపాధి అవకాశాలు కూడా లభించనున్నాయి. జిల్లాలో ప్రస్తుతం ఐదు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 1,006 అంగన్‌వాడీ కేంద్రాలు కొనసా గుతున్నాయి. ఇందులో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు 176, సహాయకుల పోస్టులు 464 ఉన్నాయి. ఖాళీల నియామకం చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తుండడంతో నిరుద్యోగ మహిళల్లో ఉత్సాహం నెలకొన్నది.

Updated Date - May 30 , 2026 | 11:55 PM