Share News

బీటెక్‌ విద్యార్థులకు గ్రేస్‌ మార్కులు!

ABN , Publish Date - Jul 04 , 2026 | 06:18 AM

జేఎన్‌టీయూ అనుబంధ, ప్రైవేటు అఫిలియేటెడ్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో చదువుతున్న బీటెక్‌ విద్యార్థులకు గ్రేస్‌ మార్కులు ఇవ్వాలని..

బీటెక్‌ విద్యార్థులకు గ్రేస్‌ మార్కులు!

హైదరాబాద్‌ సిటీ, జూలై 3 (ఆంధ్రజ్యోతి): జేఎన్‌టీయూ అనుబంధ, ప్రైవేటు అఫిలియేటెడ్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో చదువుతున్న బీటెక్‌ విద్యార్థులకు గ్రేస్‌ మార్కులు ఇవ్వాలని వర్సిటీ యాజమాన్యం నిర్ణయించింది. విద్యార్థి సంఘాలు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసు కుంది. వర్సిటీ ఆర్‌22 రెగ్యులేషన్స్‌ను వర్సిటీ అధికారులు తాజాగా సవరించారు. బీటెక్‌తో పాటు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల విద్యార్థులకు కూడా మొత్తం మార్కుల్లో 0.15శాతం గ్రేస్‌మార్కులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

Updated Date - Jul 04 , 2026 | 06:18 AM