Share News

జేఎన్‌టీయూ అనుబంధ కాలేజీలకు ఊరట.!

ABN , Publish Date - Jun 26 , 2026 | 04:11 AM

బోధనా సిబ్బంది కొరతతో ఇక్కట్లు పడుతున్న జేఎన్‌టీయూ అనుబంధ కాలేజీలకు తాత్కాలికంగా ఊరట లభించనుంది. వర్సిటీ పరిధిలోని ఖమ్మం....

జేఎన్‌టీయూ అనుబంధ కాలేజీలకు ఊరట.!

  • కాంట్రాక్టు అధ్యాపకుల నియామకానికి నోటిఫికేషన్‌ జారీ

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): బోధనా సిబ్బంది కొరతతో ఇక్కట్లు పడుతున్న జేఎన్‌టీయూ అనుబంధ కాలేజీలకు తాత్కాలికంగా ఊరట లభించనుంది. వర్సిటీ పరిధిలోని ఖమ్మం(పాలేరు), మహబూబాబాద్‌, జగిత్యాల, మంథని, సుల్తాన్‌పూర్‌ లలో ఉన్న ఇంజనీరింగ్‌, ఫార్మసీ కళాశాలల్లో ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. జేఎన్‌టీయూకు ఉన్న బ్రాండ్‌తో విద్యార్థులు ప్రవేశాలు పొందుతున్నప్పటికీ, గత కొన్నేళ్లుగా సిబ్బంది నియామక ప్రక్రియను ప్రభుత్వం చేపట్టకపోవడంతో బోధన ప్రశ్నార్ధకంగా మారింది. మరో నెలరోజుల్లో కొత్తగా బీటెక్‌, బీఫార్మసీ ఫస్టియర్‌ విద్యార్థులు రానుండడంతో కళాశాలల నిర్వహణ ప్రిన్సిపాళ్లకు కత్తిమీద సాములా మారింది. ఈ క్రమంలో ప్రభుత్వం మంజూరు చేసిన 67 పోస్టులకు తాత్కాలిక ప్రాతిపదికన ఫ్యాకల్టీని భర్తీ చేయాలని వర్సిటీ నిర్ణయించింది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 29లోగా జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో స్వయంగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

Updated Date - Jun 26 , 2026 | 04:11 AM