ఐఏఎస్ కావాలని..!
ABN , Publish Date - Mar 07 , 2026 | 04:01 AM
సంకల్ప బలం ఉంటే సాధించలేనిది ఏదీ లేదనడానికి నిలువెత్తు సాక్ష్యం... జినియా అరోరా. గత సివిల్స్ పరీక్షల్లో 156వ ర్యాంకు సాధించిన ఆమె... ఐపీఎస్ అధికారిణి అయ్యారు. కానీ జినియా లక్ష్యం... ఐఏఎస్. దాని కోసం మళ్లీ ప్రయత్నించారు. ఈసారి ఆరో ర్యాంకు సాధించి... కలను నిజం చేసుకున్నారు. .....
సంకల్ప బలం ఉంటే సాధించలేనిది ఏదీ లేదనడానికి నిలువెత్తు సాక్ష్యం... జినియా అరోరా. గత సివిల్స్ పరీక్షల్లో 156వ ర్యాంకు సాధించిన ఆమె... ఐపీఎస్ అధికారిణి అయ్యారు. కానీ జినియా లక్ష్యం... ఐఏఎస్. దాని కోసం మళ్లీ ప్రయత్నించారు. ఈసారి ఆరో ర్యాంకు సాధించి... కలను నిజం చేసుకున్నారు.
ఏదైనా సాధించాలనే తపన ఉంటే... దాన్ని ఎవరూ అడ్డుకోలేరు. జినియా జర్నీ ఇదే చెబుతోంది. సమాజం పట్ల ప్రేమ, ప్రజలను చైతన్యవంతులను చేయాలన్న ఆశయం... ఇవే ఆమెను ఉన్నతంగా నిలబెట్టాయి. సొంతంగా ఒక స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్న జినియా విద్యాభ్యాసం ప్రముఖ విద్యా సంస్థల్లో సాగింది. ఢిల్లీ సంస్కృతి స్కూల్‌లో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆమె మొదటి నుంచీ సోషల్ సైన్సెన్స్, పబ్లిక్ అఫైర్స్‌పై ఆసక్తి చూపారు. ఢిల్లీ విశ్వవిద్యాంలయం నుంచి ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ (2022)లో బీఏ పూర్తి చేశారు. బ్యాచ్‌లో టాపర్‌గా నిలిచారు. తరువాత పర్యావరణం, సామాజిక సమస్యలపై దృష్టి పెట్టిన జినియా... మరుసటి ఏడాది ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో పీజీ చదివారు. పీజీ తరువాత సివిల్స్ సాధించాలన్న ఏకైక సంకల్పంతో అడుగులు వేశారు 2024 సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎ్‌సఈ)లో 156వ ర్యాంకు దక్కించుకున్న ఆమెను ఐపీఎ్‌సకు కేటాయించారు. జినియా... అంతటితో సరిపెట్టుకోలేదు. ఐఏఎస్ సాధించాలన్న తన కల నెరవేర్చుకొనేందుకు మరింత కష్టపడ్డారు. తాజా సివిల్స్ ఫలితాల్లో 6వ ర్యాంకు సొంతం చేసుకున్నారు. జినియాది విద్యావంతుల కుటుంబం. ఆమె తల్లితండ్రులు రాజీవ్‌కుమార్ అరోరా, అంజన... ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. వారిలోని నాయకత్వ లక్షణాలు, సామాజిక దృక్పథం ఆమెకు ప్రేరణ.