Share News

స్పెషల్‌ ప్యాకేజీతోనే బీఆర్‌ఎ్‌సలో జీవన్‌రెడ్డి చేరిక

ABN , Publish Date - Apr 21 , 2026 | 03:50 AM

జీవన్‌రెడ్డి చేరికతో బీఆర్‌ఎస్‌లో చీలికలు మొదలవుతున్నాయని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు.

స్పెషల్‌ ప్యాకేజీతోనే బీఆర్‌ఎ్‌సలో జీవన్‌రెడ్డి చేరిక

  • జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ ఆరోపణ

జగిత్యాల, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): జీవన్‌రెడ్డి చేరికతో బీఆర్‌ఎస్‌లో చీలికలు మొదలవుతున్నాయని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ అత్యంత ధనిక పార్టీ అని.. స్పెషల్‌ ప్యాకేజీ ఒప్పందంతోనే జీవన్‌రెడ్డి ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోందన్నారు. జగిత్యాలలో కేసీఆర్‌ సభకు హాజరవకుండా హరీశ్‌రావు ఢిల్లీకి ఎందుకు వెళ్లినట్లు అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌లోకి జీవన్‌రెడ్డి రావడం ఆయనకు ఇష్టం లేదన్నారు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని హరీశ్‌రావుకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేస్తున్నట్లు తనకు తెలిసిందన్నారు. జీవన్‌రెడ్డి ఉన్న పార్టీ ఎదగదని సంజయ్‌కుమార్‌ ఎద్దేవా చేశారు. గతంలో ఆయన వల్ల ఎన్‌టీఆర్‌, తక్కువ వ్యవధిలో నాదెండ్ల భాస్కర్‌రావు సీఎం పదవిని కోల్పోయారని అన్నారు.

బీఆర్‌ఎస్‌ చీలిపోయే అవకాశం: మంత్రి అడ్లూరి

జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరిన నేపథ్యంలో ఆ పార్టీ రెండుగా చీలిపోయే అవకాశం కనిపిస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. వర్గపోరు నేపథ్యంలో ఇప్పటికే కేసీఆర్‌ తనయ కవిత పార్టీకి దూరమయ్యారని.. ఇప్పుడు అదే బాటలో హరీశ్‌ పయనిస్తున్నారని ఆరోపించారు. జగిత్యాలలో ఆయన వీడియోను విడుదల చేశారు. కేసీఆర్‌ సభకు హాజరు కాకుండా హరీశ్‌ ఢిల్లీ వెళ్లడంలో ఆంతర్యమేంటన్నారు.

Updated Date - Apr 21 , 2026 | 03:50 AM