Share News

కాంగ్రెస్‌లో కొనసాగాలా.. వద్దా..?

ABN , Publish Date - Feb 17 , 2026 | 07:13 AM

జగిత్యాల మునిసిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో వలసవాదులకు, అవకాశవాదులకు అవకాశం దక్కిందని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి విమర్శించారు.

కాంగ్రెస్‌లో కొనసాగాలా.. వద్దా..?

  • సందిగ్ధ పరిస్థితి వచ్చిందంటూ జీవన్‌రెడ్డి ఆవేదన

జగిత్యాల, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల మునిసిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో వలసవాదులకు, అవకాశవాదులకు అవకాశం దక్కిందని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌లో కొనసాగాలా.. వద్దా అని ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ బీఆర్‌ఎస్‌ నుంచి గెలుపొంది కాంగ్రెస్‌తో సంసారం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. సోమవారం జగిత్యాలలో మీడియాతో జీవన్‌రెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్యే సంజయ్‌ సారథ్యంలో పనిచేయాలనుకుంటే పార్టీలో కొనసాగండి.. లేకుంటే లేదనే పరిస్థితి తయారైందని వాపోయారు. జగిత్యాల కాంగ్రెస్‌ పై సంజయ్‌కు పవర్‌ ఆఫ్‌ అటార్నీ రాసిచ్చారా అని ప్రశ్నించారు. పార్టీని నమ్ముకున్న వారికి కాకుండా వలసవాదులకు చైర్‌పర్సన్‌ పదవి ఇవ్వడం ఎలా జీర్ణించుకోవాలన్నారు. జీవన్‌రెడ్డిని ఒంటరి చేయడమే సంజయ్‌ లక్ష్యమని ఆరోపించారు.

Updated Date - Feb 17 , 2026 | 07:14 AM