జేఈఈ మెయిన్స్ సెషన్-2 ‘కీ’ విడుదల
ABN , Publish Date - Apr 12 , 2026 | 03:52 AM
జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షల ప్రాథమిక ‘కీ’ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) శనివారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ..
హైదరాబాద్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షల ప్రాథమిక ‘కీ’ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) శనివారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 566 పరీక్షా కేంద్రాల్లో ఏప్రిల్ 2-8వరకు ఈ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 11.65 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రాథమిక కీపై విద్యార్థులు తమ అభ్యంతరాలను ఆన్‌లైన్ ద్వారా తెలియజేయవచ్చు. అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం, ఈనెల 20న తుది ఫలితాలను ప్రకటించే అవకాశాలున్నాయి.