జన్వాడ ఫామ్‌హౌజ్ నాది
ABN , Publish Date - Sep 19 , 2026 | 06:34 AM
జన్వాడ ఫామ్‌హౌజ్ భూమి తనదేనని, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆ భూమితో ఎలాంటి సంబంధం లేదని ఫామ్‌హౌజ్ యజమాని బి.ప్రదీప్‌రెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడలోని ఫామ్‌హౌజ్ వద్ద ఆయన శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.
2019లో 4 ఎకరాలు కొనుగోలు చేశా
కేటీఆర్ చిన్ననాటి స్నేహితుడు..
ఏడేళ్ల క్రితం లీజుకిచ్చా
అనుమానాలుంటే భూమి పత్రాలు చూపిస్తా
కావాలని ఎవరైనా నా భూమి వద్దకువస్తే
కేసులు పెట్టేందుకు సిద్ధం: బి.ప్రదీప్‌రెడ్డి
శంకర్‌పల్లి, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): జన్వాడ ఫామ్‌హౌజ్ భూమి తనదేనని, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆ భూమితో ఎలాంటి సంబంధం లేదని ఫామ్‌హౌజ్ యజమాని బి.ప్రదీప్‌రెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడలోని ఫామ్‌హౌజ్ వద్ద ఆయన శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఆ ఫామ్‌హౌజ్ కేటీఆర్‌దంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పారు. తాను 2019లో చట్టబద్ధంగా నాలుగెకరాల భూమి కొనుగోలు చేశానని తెలిపారు. సుమారు ఏడేళ్ల క్రితం తన చిన్ననాటి స్నేహితుడైన కేటీఆర్‌కు లీజుకు ఇచ్చానని వివరించారు. తన భూమికి క్లియర్ టైటిల్ ఉందని, ప్రభుత్వానికి తనభూమిపై ఎలాంటి అనుమానాలు ఉన్నా ముందుగా నోటీసులు ఇవ్వాలని.. భూమి పత్రాలు చూపడానికి తాను సిద్ధమని స్పష్టం చేశారు. కొందరు రాజకీయ నాయకులు తన ఆస్తిమీదకు వస్తామని చేస్తున్న ప్రకటనలు మీడియాలో చూశానని చెప్పారు. ఎవరైనా కావాలని తనభూమి వద్దకు వస్తే కేసులు పెట్టేందుకు వెనుకాడబోనని హెచ్చరించారు. ఉద్దేశపూర్వకంగానే తనపై కుట్రలు చేస్తున్నారని, రాజకీయ కారణాలతో తన ఆస్తిని వివాదంలోకి లాగుతున్నారని ఆరోపించారు. జన్వాడ ఫామ్‌హౌజ్ కేటీఆర్‌దేనని వస్తున్న వార్తలు అవాస్తవమని.. కేటీఆర్‌తో తనకు ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవని స్పష్టం చేశారు.