చెత్త బండిలో విద్యార్థుల తరలింపు
ABN , Publish Date - May 09 , 2026 | 06:38 AM
జనగణన ర్యాలీలో పాల్గొనేందుకు మునిసిపల్ అధికారులు విద్యార్థులను చెత్త బండిలో తరలించారు.
జనగామ రూరల్, మే 8 (ఆంధ్రజ్యోతి): జనగణన ర్యాలీలో పాల్గొనేందుకు మునిసిపల్ అధికారులు విద్యార్థులను చెత్త బండిలో తరలించారు. జనగామ జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన ఈ ఘటనపై పలువురి నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయుతే విద్యార్థులను తరలించింది చెత్త బండి కాదని, హరితహారానికి (మొక్కలు తరలించేందుకు) ఉపయోగించే బండి అని మునిసిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి వివరణ ఇచ్చారు.