Share News

ఓసీలపై జాజుల శ్రీనివాస్‌గౌడ్ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి

ABN , Publish Date - Feb 16 , 2026 | 02:09 AM

నరల్‌ అంటే రెడ్డి, రావుల రిజర్వేషన్‌ కాదంటూ ఓసీలను కించపరిచేలా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకార ధోరణికి నిదర్శనమని...

ఓసీలపై జాజుల శ్రీనివాస్‌గౌడ్ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి

  • ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి డిమాండ్‌

నల్లకుంట, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): జనరల్‌ అంటే రెడ్డి, రావుల రిజర్వేషన్‌ కాదంటూ ఓసీలను కించపరిచేలా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకార ధోరణికి నిదర్శనమని, ఆయన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్‌ చేశారు. ఓసీలను అవహేళన చేస్తూ మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆదివారం హైదర్‌గూడలోని సంఘం కార్యాలయంలో రామారావు మాట్లాడుతూ.. ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లో పాలకుల ఓటు బ్యాంకు రాజకీయాలతో ఓసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా కుట్రలకు తెరలేపడంతో ఓసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. మునిసిపల్‌ వార్డు, డివిజన్లలో ఓసీలు 70-80 శాతం ఉన్న చోట బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు చేశారని, దీంతో ఓసీలకు అవకాశంలేకుండా పోయిందన్నారు.

Updated Date - Feb 16 , 2026 | 04:27 AM