జనరల్ అంటే.. రెడ్డి, రావులకు రిజర్వేషన్ కాదు
ABN , Publish Date - Feb 15 , 2026 | 06:58 AM
జనరల్ స్థానాలు అంటే రెడ్డి, రావులకు రిజర్వేషన్ కాదని, బీసీలు అత్యధికంగా గెలిచిన మునిసిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను బీసీలకే ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
60శాతం మేయర్, చైర్మన్ పదవులు బీసీలకే ఇవ్వాలి: జాజుల
యాదాద్రి, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): జనరల్ స్థానాలు అంటే రెడ్డి, రావులకు రిజర్వేషన్ కాదని, బీసీలు అత్యధికంగా గెలిచిన మునిసిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను బీసీలకే ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. భువనగిరిలో శనివారం ఆయన మాట్లాడుతూ మునిసిపల్ ఎన్నికల్లో బీసీలు అత్యధిక స్థానాల్లో గెలవడం ఐక్యతకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ 60, బీఆర్‌ఎస్ 10 చైర్మన్ స్థానాలను బీసీలకు ఇవ్వాల్సిందేనన్నారు. 90శాతం ఉన్న బీసీలను కాదని, 9శాతం ఉన్న వారికి పదవులు కట్టబెట్టాలని చూస్తే సహించేది లేదన్నారు. భువనగిరిలో ఒక్కరే రెడ్డి కౌన్సిలర్ గెలిచారని, చైర్మన్‌గా ఆయనకే అవకాశం ఇవ్వాలని చూడడం దుర్మార్గమన్నారు.