జీవన్‌రెడ్డి అంశంలో ఏఐసీసీ జోక్యం చేసుకుంటే బాగుండేది
ABN , Publish Date - Apr 10 , 2026 | 05:09 AM
సీనియర్ నేత జీవన్‌రెడ్డి పార్టీని వీడటంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. గురువారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు.
సోనియా, రాహుల్ కుటుంబానికి విధేయుడుగా ఉన్న జీవన్‌రెడ్డి పార్టీని వీడడం బాధాకరం
అంతర్గతంగా ఏం జరుగుతుందో ఏఐసీసీ పరిశీలించాల్సింది
ఎమ్మెల్యేలు, నాయకులు పార్టీలు మారడం ప్రస్తుతం సహజం
ఈ విషయంపై మీడియాతో మాట్లాడలేం.. అంతర్గతంగా చర్చిస్తాం
ఇది నా వ్యక్తిగత అభిప్రాయమే: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
సంగారెడ్డి టౌన్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): సీనియర్ నేత జీవన్‌రెడ్డి పార్టీని వీడటంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. గురువారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. జీవన్‌రెడ్డి విషయంలో ఢిల్లీ ఏఐసీసీ నాయకత్వం నేరుగా రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి విధేయుడుగా ఉన్న జీవన్‌రెడ్డి వంటి సీనియర్ నాయకుడు పార్టీని వీడడం బాధాకరమని అన్నారు. ఆయన విషయంలో అంతర్గతంగా ఏం జరుగుతుందో ఏఐసీసీ స్థాయిలో పరిశీలన చేయాల్సి ఉండిందని అన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో ఎమ్మెల్యేలు, నాయకులు పార్టీలు మారడం సహజమేనని అన్నారు. జీవన్‌రెడ్డి పార్టీ మారడానికి గల కారణాలను బహిరంగంగా మీడియాతో మాట్లాడలేమని.. పార్టీలో అంతర్గతంగా చర్చిస్తామన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమేనని స్పష్టం చేశారు.