Share News

మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డికి క్లీన్‌చిట్‌

ABN , Publish Date - Mar 27 , 2026 | 04:26 AM

మానవ అక్రమ రవాణా కేసులో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి జెట్టి కుసుమ్‌కుమార్‌పై దాఖలైన కేసును ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు గురవారం కొట్టివేసింది.

మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డికి క్లీన్‌చిట్‌

  • నిర్దోషిగా ప్రకటించిన ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు

  • కుసుమ్‌ కుమార్‌ కూడా నిర్దోషే.. ఆధారాల్లేవని వెల్లడి

  • బీఆర్‌ఎస్‌ హయాంలో నమోదైన కేసు

హైదరాబాద్‌, మార్చి 26(ఆంధ్రజ్యోతి): మానవ అక్రమ రవాణా కేసులో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి జెట్టి కుసుమ్‌కుమార్‌పై దాఖలైన కేసును ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు గురవారం కొట్టివేసింది. ఈ కేసుకు సంబంధించి వారిద్దరూ నిర్దోషులని తేల్చింది. జగ్గారెడ్డి, కుసుమ్‌కుమార్‌ మానవ అక్రమ రవాణాకు పాల్పడినట్లుగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో జగ్గారెడ్డిని ఏ1గా, కుసుమ్‌కుమార్‌ను ఏ3గా చేర్చింది. అయితే, 2018-23 వరకు జగ్గారెడ్డి సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉండడంతో ఈ కేసు విచారణను ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు చేపట్టింది. ఈ కేసును విచారించిన ప్రత్యేక కోర్టు.. తూర్పు జగ్గారెడ్డి, కుసుమ్‌కుమార్‌ నేరానికి పాల్పడ్డట్లుగా ఆధారాలు లేవని తేల్చింది. వారిద్దరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పును వెలువరించింది. ఈ కేసులో జగ్గారెడ్డి, కుసుమ్‌కుమార్‌ తరపున న్యాయవాది జి.సంతోష్‌రెడ్డి వాదనలు వినిపించారు.

Updated Date - Mar 27 , 2026 | 04:26 AM