సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఇఫ్తార్ విందు
ABN , Publish Date - Mar 16 , 2026 | 04:45 AM
సంగారెడ్డి పట్టణంలోని మిలాద్ గ్రౌండ్‌లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు భారీ స్థాయిలో ఇఫ్తార్ విందు ఇచ్చారు.
మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, దామోదర హాజరు
జగ్గారెడ్డి మా ఫేవరెట్ లీడర్: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
మానవత్వం ఉన్న మనిషి జగ్గారెడ్డి: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ముస్లిం సోదరులకు మంత్రుల శుభాకాంక్షలు
సంగారెడ్డి, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి పట్టణంలోని మిలాద్ గ్రౌండ్‌లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు భారీ స్థాయిలో ఇఫ్తార్ విందు ఇచ్చారు. పెద్దసంఖ్యలో ముస్లింలు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల హాజరయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. జగ్గారెడ్డి మీకు, మాకు ఫేవరెట్ లీడర్ అని ప్రశంసించారు. మంత్రి ఉత్తమ్ ప్రసంగిస్తూ.. ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే జగ్గారెడ్డి ఆదుకుంటారని, ఆయన మానవత్వం ఉన్న మనిషి అని కొనియాడారు. అనంతరం మంత్రులు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి, కొడుకు దత్తురెడ్డి పాల్గొన్నారు.