Share News

రెండో రోజూ జగ్గారెడ్డి, నిర్మల దంపతుల దీక్ష

ABN , Publish Date - Oct 09 , 2026 | 04:48 AM

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి, నిర్మల దంపతులు చేపట్టిన దీక్ష రెండోరోజూ కొనసాగింది

రెండో రోజూ జగ్గారెడ్డి, నిర్మల దంపతుల దీక్ష

  • సీఈసీ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో రాహుల్‌ గాంధీ చేపట్టిన పోరాటానికి మద్దతుగా దీక్ష

  • రాహుల్‌కు సంఘీభావంగా రాత్రింబవళ్లు సంగారెడ్డిలో దీక్షా వేదికపైనే ఉండి నిరసన తెలిపిన జగ్గారెడ్డి, నిర్మల

  • రాహుల్‌ ఉద్యమం చేసినన్నాళ్లూ తమ పోరాటమూ ఉంటుందని వెల్లడి..

    దీక్షకు మద్దతుగా తరలివచ్చిన ప్రజా సంఘాలు, కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు

  • దేశ ప్రజలంతా రాహుల్‌ గాంధీకి

అండగా నిలవాలి: జగ్గారెడ్డి

సంగారెడ్డి, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి, నిర్మల దంపతులు చేపట్టిన దీక్ష రెండోరోజూ కొనసాగింది. సంగారెడ్డిలోని ఓల్డ్‌ బస్టాండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బుధవారం రాత్రి జగ్గారెడ్డి, నిర్మల తమ దీక్ష ప్రారంభించారు. గురువారం సైతం కొనసాగించారు. రాత్రింబవళ్లు దీక్షా వేదికపైనే ఉన్నారు. ఈ దీక్షకు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల నేతలు, స్థానిక ప్రజలు మద్దతు పలికారు. మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ధర్మపురి సంజయ్‌, సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ రెడ్డి దీక్షా శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజలందరూ రాహుల్‌ గాంధీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

Updated Date - Oct 09 , 2026 | 05:34 AM