Share News

kumaram bheem asifabad-21 ఏళ్లుగా పూర్తి కాని ‘జగన్నాథ్‌పూర్‌’

ABN , Publish Date - Jun 19 , 2026 | 11:01 PM

కుమరం భీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం జగన్నాథ్‌పూర్‌ వద్ద నిర్మిస్తున్న జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి 21 ఏళ్లు గడిచినా ఇప్పటికీ పూర్తి కాని పరిస్థితి నెలకొన్నది. ఎండకాలంలో పెండింగ్‌ పనులు పూర్తి వర్షాకాలంలో ఈ ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసి ఆయకట్టు రైతాంగానికి నీరందించేలా చేస్తారని ఎంతో ఆశలు పెట్టుకున్న రైతాంగానికి ఈ సారికూడా ఎండమావిగానే మారింది. గత ఏడాది రాష్ట్రంలో ఉన్న పెండింగ్‌ ప్రాజెక్టుల స్థితిగతులపై అధ్యాయనం చేసేందుకు కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల గ్యాస్‌ సంయుక్త కార్యదర్శి వినోద్‌ శేషన్‌ ఆధ్వర్యంలో కేంద్ర జలశక్తి శాఖ బృంద సభ్యులు పర్యటించారు. ఇందులో భాగంగా గతేడాది జూల్‌ 10న ఈ ప్రాజెక్టును కూడా సందర్శించారు.

kumaram bheem asifabad-21 ఏళ్లుగా పూర్తి కాని ‘జగన్నాథ్‌పూర్‌’
అసంపూర్తిగా ఉన్న జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టు

కాగజ్‌నగర్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం జగన్నాథ్‌పూర్‌ వద్ద నిర్మిస్తున్న జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి 21 ఏళ్లు గడిచినా ఇప్పటికీ పూర్తి కాని పరిస్థితి నెలకొన్నది. ఎండకాలంలో పెండింగ్‌ పనులు పూర్తి వర్షాకాలంలో ఈ ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసి ఆయకట్టు రైతాంగానికి నీరందించేలా చేస్తారని ఎంతో ఆశలు పెట్టుకున్న రైతాంగానికి ఈ సారికూడా ఎండమావిగానే మారింది. గత ఏడాది రాష్ట్రంలో ఉన్న పెండింగ్‌ ప్రాజెక్టుల స్థితిగతులపై అధ్యాయనం చేసేందుకు కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల గ్యాస్‌ సంయుక్త కార్యదర్శి వినోద్‌ శేషన్‌ ఆధ్వర్యంలో కేంద్ర జలశక్తి శాఖ బృంద సభ్యులు పర్యటించారు. ఇందులో భాగంగా గతేడాది జూల్‌ 10న ఈ ప్రాజెక్టును కూడా సందర్శించారు. అసంపూర్తి దశ వీడని పరిస్థితులపై క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరించారు. ఏడాది గడిచిన కూడా ఎలాంటి పురోగతి లేని పరిస్థితి ఏర్పడింది. ఈ సారి వేసే పంటలకు కనీసం ఈ ప్రాజెక్టు నీటిని వినియోగించుకోవచ్చన్న పెట్టుకున్న ఆశలు ఈ సారి కూడా వర్షాధారంపైనే ఆధార పడాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. 2005లో దివంగత ముఖ్యమత్రి వైఎస్సాఆర్‌ హాయంలో జగన్నాథ్‌పూర్‌ వద్ద పెద్దవాగు సమీపంలో జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.125 కోట్ల వ్యయంతో శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. గ్యామన్‌ ఇండియా కాంట్రాక్టర్‌ పనులు దక్కించుకొని పనులు ప్రారంభించారు. సకాలంలో నిధుల విడుదల కాక పోవడంతో సంబంధిత కాంట్రాక్టర్‌ పనుల నిలిపివేశారు. అనంతరం పాలకులు పట్టించుకోక పోవడం తో అతీగతీ లేని పరిస్థితి ఏర్పడింది. మళ్లీ ప్రభుత్వం స్పందించి కాల గడువు పరిమితి పెంచడంతో పనులు ప్రారంభించారు. ఫలితంగా కేవలం నాలుగేళ్ల పాటు పిల్లర్ల దశ వీడని పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రక్రియ కాగానే మళ్లీ ప్రత్యామ్నాయంగా సబ్‌ కాంట్రాక్టర్‌తో పనులు చేయించడంతో ప్రాజెక్టు నిర్మాణం ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు. రాష్ట్రాలు విడి పోవడంతో ఈ ప్రాజెక్టు సమస్యను సీఎం కేసీఆర్‌ దృష్టికి అప్పటి ఎమ్మెల్యే కోనప్ప తీసుకెళ్లారు. వ్యయ భారం పెరగడంతోనే ఈ పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో సమస్యను పరిష్కరించేం దుకు ఈ ప్రాజెక్టు వ్యయాన్ని ఏకంగా రూ.246.49 కోట్లకు పెంచేసి ఈ పనులు చేపట్టేందుకు మళ్లీ ప్రక్రియ ప్రారంభం చేశారు.

- పిల్లర్ల స్థాయిలోనే..

ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రస్తుతం పిల్లర్ల స్థాయి వీడి గేట్ల వరకు వచ్చింది. 21 ఏళ్లు గడిచినా కూడా ఇంత వరకు ప్రాజెక్టు నిర్మాణం, కాల్వలు పరిస్థితి పూర్తి కాక తంటాలు పడాల్సిన పరిస్థితి దాపురించింది. కానీ తెలంగాణ రాష్ట్రంలోని పెండింగ్‌ ప్రాజెక్టులు ఎందుకు పురోగతి లేదన్న కోణంలో గతేడాది కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల గ్యాస్‌ సంయక్త కార్యదర్శి వినోద్‌ శేషన్‌ ఆఽధ్వర్యంలో కేంద్ర జలశక్తి శాఖ బృంద సభ్యులు పర్యటించారు. ఈ ప్రాజెక్టును కూడా ఐదు గంటల పాటు సందర్శించారు. ఏ గేట్‌, విద్యుత్‌ లైన్లు ఇంకా ఏర్పాటు చేయలేదని, భూ సేకరణ, కాల్వల నిర్మాణం డైవెర్షన్‌ వంటి పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నట్టు, 600 మీటర్ల బండ్‌ డైవెర్షన్‌ ఇంకా చేయాల్సి ఉన్నట్టు, అలాగే మౌలిక నిర్మాణాల లోపాలున్నట్టు, మారిన ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయింపులు సరిగ్గా లేదని రైతులతో పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్టుకు ఎన్ని నిధులు అవసరం అవుతాయని నివేదిక పంపిస్తామని తెలియజేశారు. ఈ పర్యటన చేపట్టి ఏడాది దాటింది. ఇంత వరకు దీనిపై ముందడుగు పడిని పరిస్థితి నెలకొ న్నది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆశించిన మేర నిధులు విడుదల చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి అనుమతి లేని పరిస్థితి ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం ఎండకాలం పూర్తిగా అయిపోంది. వర్షాకాలం ఆరంభం అవుతుండడంతో మళ్లీ వర్షాధార పంటలు వేసుకోవాల్సిందేనని రైతులు చెబుతున్నారు.

Updated Date - Jun 19 , 2026 | 11:01 PM