Share News

నీది కేటీఆర్‌ వర్గమా.. లేక హరీశ్‌ వర్గమా?

ABN , Publish Date - May 19 , 2026 | 04:35 AM

కాంగ్రెస్‌ నాయకులు బీఆర్‌ఎస్‌ పార్టీతో టచ్‌లో ఉన్నారని జగదీశ్‌ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. 10 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు...

నీది కేటీఆర్‌ వర్గమా.. లేక హరీశ్‌ వర్గమా?

  • జగదీశ్‌రెడ్డికి అద్దంకి ప్రశ్న

హైదరాబాద్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): ‘‘కాంగ్రెస్‌ నాయకులు బీఆర్‌ఎస్‌ పార్టీతో టచ్‌లో ఉన్నారని జగదీశ్‌ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. 10 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సతో కలిసి పనిచేస్తున్న సంగతి ఆయనకు తెలియదా? ముందు ఆ పార్టీ ఉంటుందో.. ఉండదో చూసుకోవాలి. ఉంటే జగదీశ్‌రెడ్డిది ఏ వర్గం? కేటీఆర్‌ వర్గమా.. లేక హరీశ్‌ వర్గమా?’’ అంటూ మండలిలో ప్రభుత్వ విప్‌ అద్దంకి దయాకర్‌ ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ పెట్టుకున్న కవిత అడిగే ప్రశ్నలకు జగదీ్‌షరెడ్డి దగ్గర సమాధానం ఉందా అని నిలదీశారు.

Updated Date - May 19 , 2026 | 04:35 AM