దేవాదాయశాఖలోకి ఎంపీడీవోలు పెన్‌డౌన్ యోచనలో జేఏసీ
ABN , Publish Date - Feb 17 , 2026 | 06:30 AM
ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి డిప్యూటేషన్‌పై అధికారులు, సిబ్బందిని దేవాదాయ శాఖలోకి...
హైదరాబాద్, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి డిప్యూటేషన్‌పై అధికారులు, సిబ్బందిని దేవాదాయ శాఖలోకి తీసుకోవద్దనే నిబంధనలకు విరుద్ధంగా ఎంపీడీవోలను తీసుకోవడంపై విమర్శలు తలెత్తుతున్నాయి. డిప్యూటేషన్లు వద్దని చెబుతూనే మంత్రి కొండా సురేఖ స్వయంగా ఎంపీడీవోల్ని డిప్యూటేషన్లపై తీసుకురావడంపై ప్రత్యేక జేఏసీ నేతలు పెన్‌డౌన్‌కు సిద్ధమౌతున్నారు. దీనికి సంబంధించి మంత్రికి, కమిషనర్‌కు వినతి పత్రం ఇవ్వడంతోపాటు పెన్‌డౌన్‌కు వెళ్తున్నట్లు ప్రకటించారు.