kumaram bheem asifabad- వెరిఫికేషన్‌కు వేళాయె..
ABN , Publish Date - Oct 30 , 2026 | 10:38 PM
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్, ఆయా పోస్టులకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. దరఖా స్తుల స్వీకరణ పూర్తి కావడంతో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనపై ఆశావహుల్లో ఆసక్తి నెలకొన్నది. జిల్లాలో మొత్తం 433 పోస్టుల భర్తీకి నోటిషికేషన్ విడుదల చేశారు.
- 4 నుంచి ధ్రువపత్రాల పరిశీలన
కాగజ్‌నగర్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్, ఆయా పోస్టులకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. దరఖా స్తుల స్వీకరణ పూర్తి కావడంతో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనపై ఆశావహుల్లో ఆసక్తి నెలకొన్నది. జిల్లాలో మొత్తం 433 పోస్టుల భర్తీకి నోటిషికేషన్ విడుదల చేశారు. ఇందులో 153 అంగన్‌వాడీ టీచర పోస్టులు, 280 ఆయా పోస్టులు న్నాయి. అక్టోబరు 9 నుంచి 23 వరకు తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించారు. సిర్పూరు (టి), కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, జైనూరు, వాంకిడి ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఈ నియామకాలను చేపట్టనున్నారు.
- అర్హుల గుర్తింపునకు..
అభ్యర్థుల దరఖాస్తులో పొందుపరిచిన వివరాలు, విద్యార్హత, స్థానికత, కుల ధ్రువీకరణ పత్రాలు తదితర అంశాలను పరిశీలించి అర్హులను గుర్తించాల్సి ఉంది. నవంబరు 4 నుంచి ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం కానుంది. ఆసిఫాబాద్ ప్రాజెక్టు పరిఽధిలోని ఆసిపాబాద్ మండలంలో నవంబరు 4, 6 తేదీల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రెబ్బెన మండలంలో 6న, తిర్యాణిలో 7న, జైనూరు ప్రాజెక్టు పరిధిలోని జైనూర్ మండలంలో 4, 5 తేదీల్లో, సిర్పూరు(యు), లింగపూర్ మండలాల్లో 6, 7తేదీల్లో పత్రాల పరిశీలన కొనసాగనుంది. కాగజ్‌నగర్ ప్రాజె క్టు పరిధిలోని కాగజ్‌నగర్ మండలంలో 4, 5 తేదీల్లో, దహెగాం మండలంలో 6, 7 తేదీల్లో ప్రక్రియ నిర్వహిస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రతిని తప్పనిసరిగా తీసుకరావాల్సి ఉంది. దరఖాస్తులో పేర్కొన్న అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు పరిశీలనకు అం దించాలి. అన్ని ధ్రువీకరణ పత్రాలు రెండు జతల జిరాక్స్ కాపీలను గెజిటెడ్ అధికారితో సంతకం చేసుకొని కార్యాయలంలో సమర్పించాల్సి ఉంటుంది. విద్యార్హత ఆయా పీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో నిర్ణ యించి తేదీల్లో సంబంఽధిత సీడీపీవో కార్యాలయంలో హాజరు కావాల్సి ఉంటుంది. సిర్పూరు(టి) ప్రాజెక్టు పరిధిలోని సిర్పూరు(టి), బెజ్జూరు మండలాల్లో 4వ తేదీ, కౌటాల 5, చింతలమానేపల్లి 6, పెంచికల్‌పేట 7 తేదీల్లో కొనసాగనుంది. వాంకిడి ప్రాజెక్టు పరిఽధిలో వాంకిడి మండలంలో 4, 5 తేదీలు, కెరమెరి 6, 7 తేదీలు సర్టిఫికేటల్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు జిల్లా అధికారి స్వరూపరాణి ప్రకటించారు.
- జిల్లా వ్యాప్తంగా ఇలా..
ఆసిఫాబాద్‌లో ఖాళీగా ఉన్న 49 పోస్టులకు గాను 714 దరఖాస్తులు, అలాగే ఆయా పోస్టులకు 75 ఉండగా, 337 దరఖాస్తులు వచ్చాయి. జైనూర్ పరిధిలో టీచర్ పోస్టులు 39, దరఖాస్తులు 619, ఆయా పోస్టులు 124కు 659 దరఖాస్తులు అందాయి. కాగజ్‌నగర్‌లో టీచర్ పోస్టులు 4కు 88, ఆయా పోస్టులు 7కు 21, సిర్పూరు(టి)లో 9 టీచర్ పోస్టులకు 270, 19 ఆయా పోస్టులకు 182, వాంకిడి 52 పోస్టులకు 693, 55 ఆయా పోస్టులకు 271 దర ఖాస్తులు వచ్చాయి. మొత్తం 153 టీచర్ పోస్టులకు 2384, 280 ఆయా పోస్టులకు 1,470 రావడం గమనార్హం.