kumaram bheem asifabad- మహంకాళి జాతరకు వేళాయే
ABN , Publish Date - Mar 31 , 2026 | 10:45 PM
రెబ్బెన మండలం ఇందిరానగర్‌లోని ఉన్న కనకదుర్గాదేవి, స్వయంభూ మహంకాళి అమ్మవారి ఆలయం జాతరకు సిద్ధ్దమవు తోంది. ఇద్దరు అమ్మలు కొలువైన పుణ్యక్షేత్రం, స్వయంభూగా వెలసిన మహంకాళి అమ్మవారితో పాటు కనకదుర్గాదేవి కొలువుదీరిన దేవస్థానం. ఉమ్మడి జిల్లాలోనే మహంకాళి అమ్మవారు స్వయంభూగా వెలిసిన ఆలయం కావడం ప్రత్యేకత. ఉమ్మడి జిల్లాతో పాటు పక్క జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుం టారు.
- పెద్ద సంఖ్యలో తరలిరానున్న భక్తులు
రెబ్బెన, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): రెబ్బెన మండలం ఇందిరానగర్‌లోని ఉన్న కనకదుర్గాదేవి, స్వయంభూ మహంకాళి అమ్మవారి ఆలయం జాతరకు సిద్ధ్దమవు తోంది. ఇద్దరు అమ్మలు కొలువైన పుణ్యక్షేత్రం, స్వయంభూగా వెలసిన మహంకాళి అమ్మవారితో పాటు కనకదుర్గాదేవి కొలువుదీరిన దేవస్థానం. ఉమ్మడి జిల్లాలోనే మహంకాళి అమ్మవారు స్వయంభూగా వెలిసిన ఆలయం కావడం ప్రత్యేకత. ఉమ్మడి జిల్లాతో పాటు పక్క జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుం టారు. చైత్ర పౌర్ణమి రోజున మహంకాళి అమ్మవారి పుట్టిన రోజు జాతర ప్రారంభమ వుతుంది. మూడు రోజుల పాటు ఆలయంలో అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
మూడు రోజుల పాటు జాతర..
అమ్మవారి జాతర గురు, శుక్ర, శనివారాల్లో నిర్వహిస్తారు. మొదటి రోజు శివపార్వతుల కల్యాణం, రెండో రోజు అమ్మవారికి బోనాల సమర్పణ, వన భోజనాలు, మూడో రోజుల అమ్మవారి దర్శనం. చైత్రపౌర్ణమి రోజున అమ్మవారిని దర్శించుకుంటే కోరిక కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం, మహంకాళి అమ్మవారు ఆలయంలో కొలువుదీరిన తీరు, ఆలయ నిర్మాణం, స్థల పురాణంపై గ్రామస్తులు ఈ విధంగా చెప్పుకుంటారు. ఒకప్పుడు రెబ్బెన పరిధిలో అటవీ ప్రాంతం అధికంగా ఉండేది. పెద్దపులితో పాటు అనేక రకాల కృరమృగాలు సంచరిస్తుండేవి. ఆదివాసీ గరిజనులతో పాటు ఇతరులు సైతం అటవీ సంపదపై ఆధారపడి జీవిస్తుండేవారు. ఈ క్రమంలో అడవిలోకి రాక పోకలు సాగించే సమయంలో తమను అటవీ జంతువుల నుంచి కాపాడాలని మహంకాళి అమ్మవారికి మొక్కేవారు. అమ్మవారి దయ ఉంటే తమకు ఎలాంటి హాని కలగదని వారి నమ్మకం. మహారాష్ట్రలోని చంద్రాపూర్ మహంకాళి అమ్మవారు కొలువై ఉన్న మాదిరిగానే ఇందిరానగర్‌లో కొలువైన అమ్మవారిని నైవేధ్యాలతో మొక్కలు చెల్లించుకునేవారు. అలా భక్తుల పూజలు అందుకున్న అమ్మవారి విగ్రహం కొన్నేళ్లకు అతివృష్టి కారణంగా నీటిలో మునిగి పోయింది. ఆ స్థలంలోనే పుట్ట ఏర్పడింది. చైత్ర మాసం పౌర్ణమి సమయానికి పుట్ట సంపూర్ణ ఆకారంలో భక్తులకు కనిపించగా భక్తులు అక్కడే పూజలు చేసేవారు. కాగా కాగజ్‌నగర్‌లోని బారెగూడకు చెందిన మొర్లె నారాయణ, లక్ష్మిల దంపతుల కుమారుడు వినోద్ అనే వ్యక్తికి 2014లో ఒక రోజు రాత్రి ఆయనకు కలలో పాము రూపంలో అమ్మవారు కనిపించిందని చెబుతుంటారు. ఇందిరానగర్ పుట్టలో ఉన్న తనను బయటకు తీసి పూజలు చేయమని చెప్పారట. మరుసటి రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు ప్రతి రోజు ఉదయం రాత్రి తొమ్మిది బిందెల చొప్పున పుట్టపై నీళ్లు పోయగా చైత్రపౌర్ణమి తరువాత అమ్మవారి శిలావిగ్రహం బయటపడింది. అప్పటివ నుంచి గ్రామస్తులు అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2015లో వినోద్ చిన్న ఆలయం నిర్మించి మహంకాళి అమ్మవారితో పాటు కనకదుర్గాదేవి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు. కాగా ఆలయం వెనక భాగంలో భూగర్భంలోకి గుహలో కొలువుదీరిన మహంకాళి అమ్మవారి విగ్రహం ప్రత్యేక ఆకర్ణగా నిలుస్తోంది. మహారాష్ట్రలోని చంద్రాపూర్(చాందా) మహంకాళి ఆలయంలో ఉన్న మాదిరిగానే ప్రధాన ఆలయం వెనక భాగంలో పది ఫీట్ల లోతులో గుహను ఏర్పాటు చేసి అందులో పడుకుని ఉన్నట్లు అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో 21 ఫీట్ల ఎత్తులో ఏర్పాటు చేసిన మహంకాళి విగ్రహంతో పాటు 15 ఫీట్ల నాగదేవత విగ్రహా లు, శనేశ్వరుడి ఆలయం, కాలభైరవుడు, అరుణాచలం శివుడి ఆలయాలు ఉన్నాయి.