‘తొలిముద్ద’కు వేళాయె..
ABN , Publish Date - Nov 25 , 2026 | 01:41 AM
గర్భం దాల్చిన నాటినుంచి చిన్నారుల ఎదుగుదల వరకు పౌష్టికాహారం అందించే ఆరోగ్య కేంద్రాలుగా అంగన్‌వాడీలు పని చేస్తున్నాయి. చిన్నారులకు ఆట పాటలతో ప్రీప్రైమరీ విద్యను అందించడంతోపాటు గర్భిణులు, బాలింతలు, కిషోర బాలికలకు పౌష్టికా హారం అందిస్తున్నారు. ఇదేక్రమంలో ప్రభుత్వం
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
గర్భం దాల్చిన నాటినుంచి చిన్నారుల ఎదుగుదల వరకు పౌష్టికాహారం అందించే ఆరోగ్య కేంద్రాలుగా అంగన్‌వాడీలు పని చేస్తున్నాయి. చిన్నారులకు ఆట పాటలతో ప్రీప్రైమరీ విద్యను అందించడంతోపాటు గర్భిణులు, బాలింతలు, కిషోర బాలికలకు పౌష్టికా హారం అందిస్తున్నారు. ఇదేక్రమంలో ప్రభుత్వం తాజా గా చిన్నారులకు పౌష్టికాహార లోపాన్ని అధిగమించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో తొలిముద్ద బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో కలిసి ఇప్పటికే లాంఛనంగా ప్రారం భించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో బ్రేక్‌ఫాస్ట్ కోసం సిద్ధం చేశారు.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 586 అంగన్ వాడీ కేంద్రాల్లో ఇప్పటికే మధ్యాహ్న భోజనాన్ని అంది స్తున్నారు. 43వేల లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో 3224 మంది గర్భిణులు, 2729 మంది బాలింతలు, 3091మంది ఆరునెలల చిన్నారులు, మూడు సంవత్స రాలలోపు పిల్లలు 16980మంది, మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల వరకు 7841 మంది పిల్లలు ఉన్నారు. ఇందులో బ్రేక్‌ఫాస్ట్ అర్హులు దాదాపుగా 17 వేలమంది వరకు ఉంటారు. ఇప్పటికే ఏడు నెలల నుంచి మూడేళ్లవరకు వయసున్న చిన్నారులకు బాలా మృతం, ప్రతినెల 16కోడిగుడ్లు అందిస్తున్నారు. మూ డేళ్లనుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు, బాలింతలకు ప్రతి రోజు ఉడికించిన కోడిగుడ్డు, మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారు. ఆకుకూరలు, కూరగాయలతో కూడిన పౌష్టికాహారం అందిస్తున్నారు. ఇదే క్రమంలో చిన్నా రులు ఉదయం వేళల్లో ఇళ్ల వద్ద ఏమి తినకుండానే అంగన్‌వాడీ కేంద్రాలకు వస్తున్న వారు ఉన్నారు. వీరు మధ్యాహ్నం వరకు నీరసించిపోయే పరిస్థితి ఉండడం తో చిన్నారులకు తొలిముద్దు బ్రేక్‌ఫాస్ట్ పేరుతో పోష కాహారం అందించనున్నారు.
పోషకాహార లోపాన్ని
అధిగమించే దిశగా...
అంగన్‌వాడీకి వచ్చే చిన్నారులు పోషకాహారలో పాన్ని అధిగమించే దిశగా పిల్లల ఎత్తు, బరువు ద్వారా పోషణ లోపం, తీవ్ర పోషణ లోపాన్ని గుర్తించి టీచర్లు ఆన్‌లైన్ చేస్తున్నారు. పోషణ్‌ట్రాకర్, ఎల్‌హెచ్ ఏఎస్ యాప్‌లో వివరాలు పొందుపరుస్తూ పోషణ పురోగతిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తూ వారికి పోషకాహారం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు తొలిముద్ద (బ్రేక్‌ఫాస్ట్) పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుం దని భావిస్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమంలో చిన్నారు లకు ఉప్మా, కిచిడి అందిస్తారు. ప్రభుత్వమే పోషకాల మిశ్రమం కలిగిన సామగ్రి పంపించనుంది. చిన్నా రుల ఎత్తు, మానసిక ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా విటమిన్లు, ప్రోటీన్లు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఉప్మా, కిచిడిలో శక్తి పోషకాలతో పాటు ప్రోటీన్లు, ఐరన్, కాల్షియం, విటమిన్లు, జింక్ వంటి సూక్ష్మపోషకాలు ఉండేలా పోషకాహార నిపు ణుల సూచనల మేరకు ఒక్కో చిన్నారికి రోజుకు 116.25కిలో కేలరీల శక్తితో పాటు 3.9గ్రాముల ప్రోటీన్లు అందించేలా అల్పాహారం రెడిమిక్స్‌ను తయా రు చేశారు. జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల కు రెడిమిక్స్‌ను పంపించారు. అల్పాహారం తయారీ, పంపిణీ, పరిశుభ్రత చిన్నారులకు అందించే విధంగా సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నారు. ప్రధానంగా అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పేద కుటుంబాల చిన్నా రులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
చిన్నారులపై ప్రత్యేక దృష్టి
జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారుల ఎదుగుదలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఎదుగుదల లోపం ఉన్న పిల్లలను గుర్తించి వారికి ప్రత్యే కంగా బాలామృతం ప్లస్‌ను అదనంగా అంది స్తూ పర్యవేక్షిస్తున్నారు. అంగన్‌వాడీలో ఈ వారంలో ప్రారంభమయ్యే తొలిముద్ద కార్యక్ర మంలో ఉదయం 9గంటల నుంచి 9.30గంట అల్పాహారాన్ని చిన్నారులకు అందిస్తారు. జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో 43వేల మంది లబ్ధిదారులు ఉండగా, ఇందులో 37 వేల మంది చిన్నారులు ఉన్నారు. వీరిలో 137 మంది అతి తీవ్ర పోషణ లోపం, 906 మంది సాధారణ పోషణ లోపం, 293మంది బరువు తక్కువ ఉన్న చిన్నారులు ఉన్నారు. ఇలాంటి సమస్యలు రాకుండా బ్రేక్‌ఫాస్ట్ ద్వారా అందిం చే పోషకాహారం ఉపయోగపడుతుంది.
ఆయాల ఖాళీలతో ఇబ్బందులు..
ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చిన్నారులకు తొలిముద్ద కార్యక్రమాన్ని అమలుకు శ్రీకారం చుట్టినాఅంగన్‌వాడీకేంద్రాల్లో ఖాళీలు ఇబ్బం దికరంగా మారే పరిస్థితిలు ఉన్నాయి. ఎట్టకే లకు సిరిసిల్ల, వేములవాడ ప్రాజెక్టు పరిధిలో అంగన్‌వాడీల్లో 55టీచర్ల పోస్టులకు నోటిఫికేష న్ ఇచ్చి 41మంది నియామక ప్రక్రియ పూర్తి చేశారు. రెండు ప్రాజెక్టుల పరిధిలో 183 ఆయాలు(సహాయకులు) ఖాళీల భర్తీకి మాత్రం శ్రీకారం చుట్టలేదు. ప్రధానంగా అంగన్‌వాడీకేంద్రాల్లో అల్పాహారం అందించ డానికి కీలకంగా ఆయాలు పని చేయాల్సి ఉంటుంది. ఆయాల ఖాళీలతో అల్పాహారం అందించడంలో టీచర్లపై భారం పడుతుంది. ఆయాలు ఖాళీగా ఉన్నచోట చిన్నారులకు బ్రేక్‌ఫాస్ట్ అందించడం కూడా ఇబ్బందికరంగా మారుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.