kumaram bheem asifabad- ‘తొలిముద్ద’కు వేళాయె..
ABN , Publish Date - Apr 08 , 2026 | 10:50 PM
అంగన్‌వాడీ కేంద్రాల్లో కొందరు చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం అల్పాహారం అందిచాలని నిర్ణయించింది. ఇందుకోసం తొలిముద్ద పథకాన్ని అమలు చేస్తోంది. బాల్యదశలోనే చిన్నారులకు వయస్సుకు తగిన పౌష్టికాహారం అందిస్తే చిన్నారులు పౌష్టికాహార లోపం బారిన పడకుండా ఎదుగుతారు. ఇటీవల అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం రేవంత్‌రెడ్డి, స్ర్తీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో కలిసి ఈ కార్యక్రమా న్ని ప్రారంభించారు. జిల్లాలోనూ ‘తొలిముద్ద’ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు అవసరమైన చర్యలు చేపట్టారు.
- పౌష్టికాహార లోపాన్ని అధిగమించేలా చర్యలు
బెజ్జూరు, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాల్లో కొందరు చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం అల్పాహారం అందిచాలని నిర్ణయించింది. ఇందుకోసం తొలిముద్ద పథకాన్ని అమలు చేస్తోంది. బాల్యదశలోనే చిన్నారులకు వయస్సుకు తగిన పౌష్టికాహారం అందిస్తే చిన్నారులు పౌష్టికాహార లోపం బారిన పడకుండా ఎదుగుతారు. ఇటీవల అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం రేవంత్‌రెడ్డి, స్ర్తీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో కలిసి ఈ కార్యక్రమా న్ని ప్రారంభించారు. జిల్లాలోనూ ‘తొలిముద్ద’ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు అవసరమైన చర్యలు చేపట్టారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన ఏడు నెలల నుంచి మూడేళ్ల వయస్సు ఉన్న చిన్నారులకు ఇప్పటికే బాలామృతం, నెలకు 16కోడిగుడ్లు అందజేస్తుండగా, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు ప్రతిరోజూ ఉడికించిన కోడిగుడ్డు, మధ్యాహ్నం ఒకపూట భోజనం పెడుతున్నారు. భోజనంలో అన్నంతో పాటు ఆకుకూ రలు, కూరగాయలు, సాంబారు ఉండేలా చూస్తున్నా రు. ఇదిలా ఉంటే కేంద్రాలకు వచ్చే చిన్నారుల్లో కొందరు ఉదయం వేళ ఇంట్లో తిని వస్తుండగా, కొందరు తినకుండానే వచ్చి నీరసించిపోతున్నారు. దీంతో మధ్యాహ్నం భోజనం వరకు నిరీక్షించాల్సి వస్తోంది. దీనికితోడు చిన్నారులు తీసుకునే ఆహారంలో అవసరమైన పోషకాలు లేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వయస్సుకు తగిన విధంగా ఎదుగుదల లేకపోవడంతో పాటు వివిధ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. కేంద్రాల్లో అందే భోజనంతో పిల్లలకు వారి వయస్సుకు తగిన పోషకాలు అందడం లేదని గుర్తించిన ప్రభుత్వం చిన్నప్పటి నుంచే వారికి సరిపడా పోషకాలు ఉండే విధంగా ‘తొలిముద్ద’ బ్రేక్‌పాస్ట్ అమలు చేసేలా రూపకల్పన చేసి అమలు చేయడానికి నిర్ణయించింది.
- రక్తహీనత తగ్గడమే కాకుండా..
ఈ పథకం ద్వారా చిన్నారుల్లో రక్తహీనతతగ్గడమే కాకుండా అవసరమైన పోషకాలతో వారిలో ఎదుగు దల చురుగ్గా కొనసాగనుంది. పోషక లోపాలను అధిగమించేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంతే కాకుండా అంగన్‌వాడీ కేంద్రాలకు ఆధరణ పెరిగి ఇక్కడికి వచ్చే చిన్నారుల సంఖ్య మరింత పెరగనుంది. పేద కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గనుంది. జిల్లాలో పౌష్టికాహార లోపంతో బాధపడు తున్న ఎంతో మంది చిన్నారులకు తొలిముద్ద పథకం ఎంతగానో ఉపయోగపడనుంది. ఎత్తుకు తగిన బరువు లేకపోవడం, వివిధ పోషకాల లోపాల సమస్యను ఎదుర్కొంటున్న పిల్లలకు తొలిముద్ద బ్రేక్‌పాస్ట్ కార్యక్రమం ప్రయోజనం కలిగించనుంది. చిన్నారులు ఎంతో ఇష్టంగా తినే విధంగా తినేదాంతో వారికి పోషకాలు అందే విధంగా ప్రభుత్వం తొలిముద్ద బ్రేక్‌పాస్ట్ మెనూ ఖరారు చేసింది. అవసరమైన పోషకాలు ఉండే విధంగా ఉప్మా, కిచిడీ తదితర ఆహార పదార్థాలు అందజేస్తారు. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు రోజూ ఉదయమే వేడివేడి ఉప్మా, కిచిడీ అందిస్తారు. పోషకాల మిశ్రమం కలిగిన ఆహారం అందిస్తారు. చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు ఉపయోగపడే విటమిన్లు, ప్రొటీన్లు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోనున్నారు. జిల్లా వ్యాప్తంగా 1006అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో 45,708మంది చిన్నారులు ఉన్నారు.
మార్గదర్శకాలు రాగానే అమలు..
- అలేఖ్య, ఐసీడీఎస్ సూపర్‌వైజర్, బెజ్జూరు
ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాగానే అన్ని కేంద్రాల్లో అమలయ్యేలా చర్యలు చేపడతాం. పథకం అమలుతో పోషకాహార లోపం ఉన్న పిల్లల సంఖ్యను మరింత తగ్గించే అవకాశం ఉంటుంది. ఇంకా రెడీ టూ కుక్ అల్పాహారం ప్యాకెట్లు కేంద్రాలకు సరఫరా కావాల్సి ఉంది.