Share News

kumaram bheem asifabad- విత్తనపూజకు వేళాయె..

ABN , Publish Date - Jun 07 , 2026 | 10:08 PM

వర్షాకాలం ఆరంభంతో జిల్లాలో ఆదివాసీ వ్యవసాయ సంస్కృ తి కళకళలాడుతోంది. పంటల సాగు ప్రారంభానికి ముందు కులదైవాలకు విత్తనాలు సమర్పించి ఆశీ ర్వాదాలు పొందే ‘విజంగ్‌ మొహుతుర్‌’ సంప్రదా య వేడుకలు ఆదివాసీ గ్రామాల్లో భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. అనాదిగా వస్తున్న ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంలో ఆదివాసీలు ముందుంటారు.

kumaram bheem asifabad- విత్తనపూజకు వేళాయె..
లోగో

- ఆదివాసీ గ్రామాల్లో సందడి

జైనూర్‌, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): వర్షాకాలం ఆరంభంతో జిల్లాలో ఆదివాసీ వ్యవసాయ సంస్కృ తి కళకళలాడుతోంది. పంటల సాగు ప్రారంభానికి ముందు కులదైవాలకు విత్తనాలు సమర్పించి ఆశీ ర్వాదాలు పొందే ‘విజంగ్‌ మొహుతుర్‌’ సంప్రదా య వేడుకలు ఆదివాసీ గ్రామాల్లో భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. అనాదిగా వస్తున్న ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంలో ఆదివాసీలు ముందుంటారు. మృగశిర కార్తె ప్రవేశిచనుండడంతో ఆదివాసీలు విత్తన పూజలు ప్రారంభించారు. పోడుభూముల్లో సాగుకు తరలివెళ్లే ముందు ఆదివాసీ గూడాల్లో సందడే సందడి. మైదాన ప్రాంతంలోని గ్రామాల్లో ఏరువాక సాగినట్టే, సాగుకు బయలు దేరే ముందు ఆదివాసీ గూడాల్లో విత్తన పండుగకు సిద్ధమయ్యారు. ఏటా తొలకరి జల్లులతో ఆదివాసీ గూడల్లో విత్తనాల పండుగ వాతావారణం నెలకొంటుంది.

- విజంగ్‌ మొహుతుర్‌..

విజంగ్‌ అంటే విత్తనాలు మొహుతుర్‌ అంటే ముహూర్తం. సాగుకు ముందు విత్తనాలు దేవుడికి చూపించడం. ఇది ఆదివాసీ రైతుల ప్రధాన ఆచారం. ప్రతీ ఆదివాసీ గ్రామాల్లో అందరు కలిసి విత్తనాల పండగ చేసుకుంటున్నారు. గత ఏడాది పండించిన ఆహారధాన్యాలను తెచ్చుకొని మోదుగ ఆకుల్లో జమ చేస్తారు. మార్కెట్లో కొన్న విత్తనాలను వీటితో కలపడం సరైంది కాదని వీళ్ల ప్రగాఢ విశ్వాసం. అందుకే తాము పండించిన పంట ధాన్యాలను మాత్రమే తీసుకోస్తు న్నారు. ఈ ధాన్యాలను దేవుళ్ల ముందు ఉంచి పూజలు చేస్తారు. పంటకు నష్టం రాకుండా చూడాలని వేడుకుంటారు.

- నువ్వుల నూనెతో..

విత్తనాల పూజలో అభిషేకం కోసం మార్కెట్లో కొను గోలు చేసిన నూనె మాత్రం వారు ఎట్టి పరిస్థితిల్లోను వాడరు. తాము తయారు చేసిన నూ నె మాత్రమే వాడుతారు. అందుకే ప్రతి గ్రామాల్లో కానుగలతో నూనె తీశారు. ఇలా తీసిన నూనెతో ప్రత్యేక వంటకాలతో అడవి తల్లికి పూజలు చేస్తారు. అనంతరం సామూహిక భోజనాలు చేస్తారు. విత్తనాల పూజలు చేయడానికి వెళ్లే దేవస్థానాలను ప్రధాన ఠికానాలు అంటారు. వీటినే అవ్వల్‌పెన్‌ అని పిలుస్తారు. వివిధ ప్రాంతాల వారు తమ దగ్గర్లోని ఠికానాలకు వెళుతున్నారు. కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని సుంగాపూర్‌ అవ్వల్‌పెన్‌, కెరమెరి, సిర్పూర్‌(యు) మండలాల సరిహద్దులో గల అడవి ప్రాంతంలో ఉంది. కవ్వాల టైగర్‌ రిజర్వు ఫారెస్ట్‌కు ఆనుకొని ఉన్న ఎత్తైన గుట్టపై దెబ్మల రాజుల అవ్వల్‌పెన్‌ ఉంది. లింగాపూర్‌ మండలంలోని జాముల్‌ధరా గ్రామ అటవీ ప్రాంతంలో కన్నెపెల్లి మోతుగూడ అవ్వల్‌ పేన్‌ ఉంది. తిర్యాణి మండంలోని దంతన్‌పెల్లి తర్వాత భీమల్‌పేన్‌ ఉంది. సిర్పూర్‌(యు) మండలంలోని సీతగోంది దగ్గర ఘాడ మసేమల్‌ పెన్‌ ఉంది. ఏజెన్సీ ప్రజలు తమ గ్రామ చుట్టు ప్రక్కల దేవస్థానాల్లో మొక్కలు చెల్లించుకుం టూనే ఇక్కడే విత్తనాలకు పూజలు చేస్తున్నారు. ఈ ప్రక్రియ ఐదు రోజులుగా ప్రారంభమైంది. విత్తన సీజనులో సుమారు నెల రోజుల పాటు ఆయా ప్రాంతాల ఆలయాల్లో సందడి ఉంటుంది.

- విత్తనాలు పంచుకుంటారు..

పొలాలు, దుక్కుల్లో విత్తనాలు చల్లడానికి (ముహుర్తం) ముందు రోజు గ్రామంలోని ఆకీ పేన్‌(గ్రామ దేవత) దగ్గర చివరి పూజ చేస్తారు. ఆనంతరం ఆ విత్తనాలను గ్రామస్తులంతా పంచు కుని ఎవరి ఇళ్లకు వారు వెళ్ళి పోయి ముహుర్తం చేస్తారు. గ్రామంలోని అందరికి పొడి కారంతో భోజనం పెడతారు. అందరు కలిసి చెక్క బిళ్ల బంతి ఆట ఆడతారు. మరుసటి రోజు నుంచి దుక్కుల్లో విత్తనాలు చల్లుతారు. విత్తనాలు చల్లడం అయిన తర్వాత పేర్నీ రేహవాల్‌( విత్తనాలు) బంద్‌తో విత్తనాల పండుగ ముగిస్తుంది. పెద్ద వర్షాలు పడక ముందే ఇవన్ని పూర్తి చేయడం ఆన వాయితీగా వస్తోంది.

Updated Date - Jun 07 , 2026 | 10:08 PM