Share News

kumaram bheem asifabad- గుడ్డు కాలమే..

ABN , Publish Date - Jan 01 , 2026 | 10:13 PM

చికెన్‌, కోడిగుడ్డు ధరల పెరుగుదల సంక్షేమ పథకాల అమలుకు శరాఘాతంగా మారింది. ఒక్కో గుడ్డుకు రూ.8వరకు పలుకుతుం డడంతో అంగన్‌వాడీలకు, హాస్టళ్లకు, పాఠశాలలకు ప్రభుత్వం సరఫరా చేసే కోడిగుడ్లు సక్రమంగా అందడం లేదు. పలు చోట్ల కోటా కంటే తక్కువగా ఇస్తున్నారు. తమకు గిట్టుబాటు కావడం లేదని ఏజెన్సీలు పంపిణీలో కోత విదిస్తుండడంతో విధ్యార్థులు పౌష్టికాహారానికి దూరమవుతున్నారు.

kumaram bheem asifabad- గుడ్డు కాలమే..
లోగో

- రిటైల్‌ మార్కెట్‌లో ఒక్కోటి రూ.8

- చేతులెత్తేసిన ఏజెన్సీలు

- అంగన్‌వాడీలు, పాఠశాలలు, హాస్టళ్లకు పంపిణీలో కోత

- మధ్యాహ్నా భోజనంలో పిల్లలకు వారానికి రెండుసార్లే

బెజ్జూరు, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): చికెన్‌, కోడిగుడ్డు ధరల పెరుగుదల సంక్షేమ పథకాల అమలుకు శరాఘాతంగా మారింది. ఒక్కో గుడ్డుకు రూ.8వరకు పలుకుతుం డడంతో అంగన్‌వాడీలకు, హాస్టళ్లకు, పాఠశాలలకు ప్రభుత్వం సరఫరా చేసే కోడిగుడ్లు సక్రమంగా అందడం లేదు. పలు చోట్ల కోటా కంటే తక్కువగా ఇస్తున్నారు. తమకు గిట్టుబాటు కావడం లేదని ఏజెన్సీలు పంపిణీలో కోత విదిస్తుండడంతో విధ్యార్థులు పౌష్టికాహారానికి దూరమవుతున్నారు. మహిళలకు, పిల్లలకు విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు ప్రభు త్వం పలు సంక్షేమ పథకాల కింద ఆహారంలో కోడిగుడ్లను చేర్చింది. అంగన్‌వాడీలు, సంక్షేమ హాస్టళ్లతో పాటు పాఠశాలల్లో అమలు చేసే మధ్యాహ్న భోజన పథకంలో కూడా గుడ్లను అందజేస్తున్నారు. మధ్యాహ్నా భోజనం అమలవుతు న్న పాఠశాలల్లో సోమవారం, బుధవారం, శుక్రవారం తప్పనిసరిగా గుడ్లు విద్యార్థులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక హాస్టళ్లలో కూడా విద్యార్థులకు కోడిగుడ్లు ఇస్తున్నారు. అంగన్‌వాడీల్లో ఆరోగ్యలక్ష్మి పథకం కింద గర్భిణులు, బాలింతలు కూడా ప్రతిరోజూ ఒకగుడ్లు, 200 మిల్లీటీటర్ల పాలు ఇస్తున్నారు. ఏ డు నెలల నుంచి మూడేళ్ల వయస్సు గల పిల్లలకు నెలకు 16గుడ్లు పంపిణీ చేస్తున్నారు. 3 నుంచి 6ఏళ్ల పిల్లలకు ప్రతిరోజూ ఒకగుడ్లు అందజేస్తున్నా రు. ఈ మేరకు కోడిగుడ్లు సరఫరా చేసే ఏజెన్సీలకు కోడిగుడ్డుకు రూ.6చొప్పున ప్రభుత్వం చెల్లింస్తోంది.

- తగ్గిన కోడిగుడ్ల ఉత్పత్తి..

చలి కాలం కావడంతో కోళ్లకు దాణా ఖర్చులు కూడా పెరిగాయి. కోడిగుడ్ల ఉత్పత్తి సైతం తగ్గిపో యింది. సాధారణంగా ఏటా చలికాలం కోడిగుడ్ల ఉత్పత్తి తగ్గుతుంది. దీనికితోడు దాణా ఖర్చులు భారీగా పెరగడంతో అనేకే మంది పౌల్ర్టీ రంగానికి దూరమ య్యారు. దీంతో కోడిగుడ్ల ఉత్పత్తి భారీగా తగ్గింది. ప్రజల అవసరాలకు తగినంతగా కోడిగుడ్ల ఉత్పత్తి లేకపోవడంతో వీటికి డిమాండ్‌ పెరిగి ఎన్నడూ లేనివిధంగా ఒకగుడ్డు ధర రూ.8కి చేరింది. ఏజెన్సీలు, హాస్టళ్ల వార్డెన్లు, మధ్యాహ్న భోజన వంట కార్మికులు తమచేతి నుంచి డబ్బులు వెచ్చించాల్సి వస్తోంది. కొన్ని హాస్టళ్లలో వార్డెన్లు, ఇతర సిబ్బంది సొంతంగా కొంత డబ్బులు వేసుకొ ని విద్యార్థులకు కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారు.

- జిల్లాలో 40వేలకు పైగా..

జిల్ల్లాలో 994ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, ఇందులో 40వేలకు పైగా విద్యార్థులు చదువుతు న్నారు. 1,591ఏజెన్సీలు ఉన్నాయి. వీటితో పాటు 42గిరిజన ఆశ్రమ పాఠశాలలు, 15 కస్తూర్బా పాఠ శాలలతో పాటు ఆదర్శ పాఠశాల, జ్యోతిబాఫూలే గురుకులాలు, ఇతర హాస్ఠళ్లు ఉన్నాయి. కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగాయి. దీంతో తమకు గిట్టుబాటు కావడం లేదని ఏజెన్సీలు విద్యార్థులకు అందించే కోడిగుడ్లలో కోత పెడుతున్నారు. మధ్యాహ్నా భోజన పథకంలో వారానికి మూడు రోజులకు బదులు రెండు రోజులే ఇస్తున్నారు. నిబంధనల ప్రకారం 45నుంచి 52గ్రాములు బరువు ఉండాలికానీ జిల్లాలో ఎక్కడా ఈ బరువున్న కోడిగుడ్లను సంక్షేమ పథకాలకు సరఫ రా చేయడం లేదు. 30నుంచి 45గ్రాములలోపు బరువున్న చిన్నగుడ్లు సరఫరా చేస్తున్నారు. మార్కెట్‌లో వీటి ఖరీదు ఒక్కోటి రూ.4.50నుంచి రూ.5ఉంటాయి. వీటిని హాస్టళ్లు, పాఠశాలలు, అంగన్‌వాడీలకు సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా పాఠశాలల్లో మధ్యాహ్నా భోజనంలో వండించేం దుకు వంట నిర్వాహకులకు ఇబ్బందులు తలెత్తు తున్నాయి. ఇప్పటికే నెలల తరబడి భోజన బిల్లులు రాక సతమత మవుతుండగా పెరిగిన గుడ్ల ధరతో మరింత భారంగా మారింది. వసతీగృహాల్లో ఇతర ఏజెన్సీలు సరఫరా చేస్తుండగా, వీరు మాత్రం కొనుగోలు చేసి పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే దుకాణాల్లో అప్పులు పెరిగాయి. ఆ అప్పు ముట్టందే మళ్లీ ఇవ్వడం కుదరదని చెప్పడంతో మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు.

ధరల పెరుగుదలతో ఇబ్బందులు...:

- కోర్తె శాంత, మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు

గుడ్ల ధరలు బాగా పెరిగాయి. ఒక్క గుడ్డు ధర రూ.8వరకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం మాకు గుడ్డుకు కేవలం రూ.6 ఇస్తోంది. రెండు నెలలుగా పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్నాం. పెరిగిన ధరలతో బిల్లు చేసి ఇవ్వాలి. మధ్యాహ్న భోజనం అందిం చే పాఠశాలలకు తక్కువ ధరకు గుడ్లు సరఫరా చేయాలి. అందుకు తగ్గట్టుగా బిల్లులు చెల్లించేందుకు సర్కార్‌ చర్యలు తీసుకోవాలి.

Updated Date - Jan 01 , 2026 | 10:13 PM