అంతా.. మా ఇష్టం..
ABN , Publish Date - Sep 19 , 2026 | 11:41 PM
అది ఒక ప్రభుత్వ కార్యాలయం. నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన అక్కడి అధికారులు అవినీతిలో మునిగి తేలుతున్నారన్న ఆరో పణలు రాజ్యమేలుతున్నాయి.
- నిర్మాణ అనుమతుల్లో ప్రైవేట్ వ్యక్తుల జోక్యం
-ప్రతీ పనికి ఓ రేటు చొప్పున వసూలు..?
-పైసలీయనిదే పనులు కావంటూ బెదిరింపులు
-క్యాతన్‌పల్లి మునిసిపాలిటీలో అధికారుల ఇష్టారాజ్యం
- ఇబ్బందిపడుతున్న పట్టణవాసులు
మంచిర్యాల, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): అది ఒక ప్రభుత్వ కార్యాలయం. నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన అక్కడి అధికారులు అవినీతిలో మునిగి తేలుతున్నారన్న ఆరో పణలు రాజ్యమేలుతున్నాయి. పైసలు ఇయ్యనిదే పను లు కావంటూ హుకుం జారీ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ బాధితులు మొత్తుకుంటున్నా రు. కార్యాలయానికి వచ్చే వివిధ రకాల పనులను ఎ లాంటి సంబంధంలేని ఓ ప్రైవేటు అసోసియేషన్‌కు బ దిలీ చేస్తూ అక్కడి నుంచే నిలువు దోపిడీకి పాల్పడు తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని క్యాతన్ పల్లి మునిసిపాలిటీలో పెద్ద ఎత్తున అవినీతి రాజ్యమే లుతున్నా....ప్రజా ప్రతినిధులుగానీ, ఉన్నతాధికారుల దృష్టికి రాకపోవడం గమనార్హం.
అసోసియేషన్‌ను సంప్రదిస్తేనే పనులు....
క్యాతన్‌పల్లి మునిసిపాలిటీ పరిధిలో ఏ పని జరగా లన్నా వినియోగదారులు ముందస్తుగా ఓ ప్రైవేటు అ సోసియేషన్ సభ్యులను కలవాల్సిందే. అక్కడ వారు ని ర్ణయించిన మొత్తం (అనధికారికంగా) చెల్లించిన తరు వాతనే కార్యాలయంలో ఫైళ్లు ముందుకు కదులుతా యి. ఇలా అధికారులు తమ పనులు చక్కబెట్టుకొనేం దుకు ఓ ప్రజా ప్రతినిధి కనుసన్నల్లో పని చేస్తున్న ప్రై వేటు అసోసియేషన్‌తో సత్సంబంధాలు నెరుపుతుండ టంతో ప్రజలు అవాక్కవుతున్నారు. పని నిమిత్తం కా ర్యాలయానికి వెళ్తే ఏకంగా అక్కడి ఓ ప్రధాన అధికారే అసోసియేషన్ సభ్యులను కలవాలంటూ చెబుతుండ టంతో నిర్ఘాంతపోతున్నారు. తమ పనులు చక్కబెట్టుకొ నేందుకు అధికారులే అసిసోయేషన్‌ను తెరపైకి తెచ్చి నట్లు బాహాటంగా ప్రచారం జరుగుతోంది.
ప్రతి పనికి ఓ రేటు..
మునిసిపల్ కార్యాలయంలో వివిధ పనుల నిమి త్తం వచ్చే వినియోగదారుల నుంచి ప్రతి పనికి ఓ రే టు చొప్పున వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉ న్నాయి. అధికారులను కలిసిన తరువాత వారు సూ చించే అసోసియేషన్ సభ్యులను సంప్రదిస్తేనే పనులు ముందుకు కదులుతాయని తెలుస్తోంది. అనంతరం అక్కడ పనిని బట్టి రేటు ఫిక్స్ చేస్తారని సమాచారం. కనీసం రూ. 50వేల నుంచి రూ. 3 లక్షల వరకు అక్ర మంగా వసూలు చేస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. అలా వసూలు చేసిన సొమ్మును నుంచి కమిషన ర్‌కు సగం ఇవ్వాల్సి ఉంటుందని అసోసియేషన్ సభ్యు లే బాహాటంగా పేర్కొంటుండటం కొసమెరుపు. అలా ముందస్తు చెల్లింపుల తరువాతనే సంబంధిత ఫైళ్లలో కదలిక వస్తుందని చెబుతున్నారు. అనంతరం అనుమ తుల కోసం కార్యాలయంలో అధికారికంగా మళ్లీ ఫీజు లు చెల్లించాల్సి వస్తోందని లబోదిబోమంటున్నారు. ఈ విషయమై అసోసియేషన్ సభ్యులు, కొందరు వినియో గదారులకు మద్య పలుమార్లు గొడవలు కూడా జరిగి నట్లు ప్రచారం జరుగుతోంది.
రూ. లక్ష డిమాండ్....
క్యాతన్‌పల్లి మునిసిపాలిటీ పరిధిలోని 7వ వార్డుకు చెందిన తూటి సతీష్ కుమార్ అనే వ్యక్తి 6వ వార్డు శేషపల్లిలో తనకు చెందిన రెండెకరాల స్థలంలో ఇటీ వల బర్ల ఫాం నిర్మాణ పనులు చేపట్టాడు. ఇందులో భాగంగా ముందుగా వాచ్‌మన్ గది నిర్మిస్తున్నాడు. ఈ క్రమంలో నిర్మాణ అనుమతులు లేవన్న కారణంతో మునిసిపల్ సిబ్బంది పనులను అడ్డుకున్నారు. దీంతో సతీష్‌కుమార్ మునిసిపల్ కమిషనర్ మురళీకృష్ణను ఆయన చాంబర్‌లో కలిసి పరిస్థితిని వివరించాడు. దీం తో కమిషనర్ ముందుగా అసోసియేషన్ సభ్యులను కలవాలని సూచించినట్లు బాధితుడు తెలిపారు. ఈ నేపథ్యంలో అసోసియేషన్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ ప్రజా ప్రతినిధిని కలవగానే లక్ష రూపాయలు చె ల్లిస్తేనే పని ముందుకు కదులుతుందని చెప్పాడు. దీం తో ముందుగా రూ. 50వేలు ఇస్తానన్న అంగీకారంతో ఆగస్టు 18వ తేదీన ఫోన్ పే ద్వారా ఆ మొత్తం చె ల్లించాడు. మిగతా మొత్తం చెల్లించడంలో ఆలస్యం కా రణంగా అసోసియేషన్ సభ్యులు గది నిర్మాణ పను లను ముందుకు సాగనివ్వడం లేదని బాధితుడు ’ఆం ధ్రజ్యోతి’తో తనగోడు వెళ్లబోసుకున్నాడు. ఈ విషయ మై అసోసియేషన్ సభ్యుడు లక్ష డిమాండ్ చేయడం మొదలుకొని, రూ. 50వేలు యూపీఐ ద్వారా చెల్లిం పులు చేసిన విషయం, ఒప్పందం ప్రకారం నిర్ణయిం చిన దాంట్లో సగం కమిషనర్‌కు ఇవ్వాల్సి ఉంటుందన్న వ్యాఖ్యలన్నీ బాధితుడి సెల్‌ఫోన్‌లో రికార్డు చేయడం కొసమెరుపు. అలా అసోసియేషన్ సభ్యులు మునిసి పాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో పనులకు సంబం ధించి ప్రజల నుంచి అడ్డగోలుగా వసూలు చేస్తున్న ప్పటికీ ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారుల దృష్టికి రా కపోవడం గమనార్హం. ఇప్పటికైనా క్యాతన్‌పల్లి ము నిసిపాలిటీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై జిల్లా ఉన్నతాధికారులు ధృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు.
నా దృష్టికి రాలేదు....
క్యాతన్‌పల్లి మునిసిపల్ కమిషనర్ మురళీకృష్ణ
వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే విని యోగదారులతో ప్రైవేటు అసోసియేషన్ సభ్యులను కలవాలని సూచిస్తున్న విషయం ఇప్పటిదాకా నా దృ ష్టికి రాలేదు. నేనైతే అలా ఎవరికీ చెప్పడం లేదు. అ న్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉండి, చట్ట ప్రకారం చేపట్టే నిర్మాణాలకు ప్రభుత్వ నిబంధనల మేరకు ఎప్పటి కప్పుడు అనుమతులు జారీ చేస్తున్నాం. నిర్మాణ అను మతులుగానీ, ఇతరత్రా పనుల కోసం మధ్య దళా రులను ఎవరినీ కలవాల్సిన అవసరం లేదు.