Share News

సింగరేణిని నాశనం చేసింది బీఆర్‌ఎస్‌యే..

ABN , Publish Date - Sep 04 , 2026 | 11:08 PM

తెలంగాణకే తలమానికమైన సింగరేణి సంస్థ బీఆర్‌ఎస్‌ పాలనలో భ్రష్టు పట్టిపో యిందని, ఉద్యోగాలు తగ్గడానికి బీఆర్‌ఎస్‌ పాలకుల విధానాలేనని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి తెలిపారు.

సింగరేణిని నాశనం చేసింది బీఆర్‌ఎస్‌యే..
మాట్లాడుతున్న మంత్రి వివేక్‌వెంకటస్వామి

-మంత్రి వివేక్‌వెంకటస్వామి

మందమర్రిటౌన్‌, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణకే తలమానికమైన సింగరేణి సంస్థ బీఆర్‌ఎస్‌ పాలనలో భ్రష్టు పట్టిపో యిందని, ఉద్యోగాలు తగ్గడానికి బీఆర్‌ఎస్‌ పాలకుల విధానాలేనని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి తెలిపారు. శుక్రవారం మందమర్రిలో విలేకరుల సమావేశంలో విలేక రుల సమావేశంలో మాట్లాడారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రంలో అన్ని రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. సింగరేణి నిధులను దుర్వినియోగం చేసిన ఘనత బీఆర్‌ఎస్‌దేనని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో వచ్చే నాటికి 65 వేల ఉద్యోగులు ఉండగా అధికారంలోకి వచ్చిన తర్వాత 38 వేలకు తగ్గారన్నారు. బీఆర్‌ఎస్‌ చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. తమ ప్రభుత్వ వె య్యి రోజుల పాలనలో ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి సీఎం రే వంత్‌రెడ్డి పెద్దపీట వేశారన్నారు. దీన్ని తట్టుకోలేక ఆందోళనలు , నిరసనలు చేస్తున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అధికారంలో లేకపోవడంతో లేని పోని విమర్శలు తమ ప్రభుత్వంపై చేస్తున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రఘునాధ్‌రెడ్డి, నాయకులు మంద తిరుమల్‌, బండి సదానందం, ఆకారం రమేష్‌, గుడ్ల రమేష్‌ , సంగి సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

-స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను సందర్శించిన మంత్రి

పట్టణంలోని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను మంత్రి శుక్రవారం సందర్శించారు. అభ్యర్థుల శిక్షణ గురించి అడిగి తెలుసుకున్నారు. జర్మ న్‌ బాష భోధన తీరును పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ నిరుద్యోగులకు విదేశాల్లో ఉపాధి కల్పించడం కోసం కృషి చేస్తున్నా మన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 04 , 2026 | 11:08 PM