‘కాళేశ్వరం ప్రాజెక్టులో దోచుకుంది కేసీఆర్ కుటుంబం
ABN , Publish Date - Jul 13 , 2026 | 11:13 PM
కాళేశ్వరం ప్రాజెక్టులో దోచుకొని దాచుకుంది మాజీ సీఎం కేసీఆర్ కుటుంబమే అని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి డా క్టర్ గడ్డం వివేక్‌వెంకటస్వామి ఆరోపించారు.
రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి
దండేపల్లి జూలై 13 (ఆంద్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో దోచుకొని దాచుకుంది మాజీ సీఎం కేసీఆర్ కుటుంబమే అని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి డా క్టర్ గడ్డం వివేక్‌వెంకటస్వామి ఆరోపించారు. సోమవా రం దండేపల్లి మండలం మ్యాదరిపేట, లిగాపూర్‌లో ఆ యన పర్యటించారు. ఈసందర్బంగా ఏర్పాటు చేసిన వి లేకరుల సమావేశంలో మాట్లాడుతూ తుమ్మిడిహెట్టి ప్రా జెక్టుకు రూ 10వేల కోట్లు వెచ్చించి నిర్మించే ప్రాజె క్టును వదిలేసి, టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో దోచుకొని దా చుకోవాలనే ఉద్దేశంతో కేజీఆర్ రాత్రిపూట నిర్ణయా ల తో తుగ్లక్ పాలన చేస్తూ రూ లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రా జెక్టు నిర్మించి లక్షల కోట్లను వృథా చేశారన్నారు. కేసీఆర్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు అప్పు 25వేల కోట్లు మిత్తిని కాంగ్రెస్ ప్రభుత్వం కడుతుందన్నారు. కమీషన్‌ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కేసీఆర్ ఫ్యామిలీ ప్రజాధానాన్ని లూటి చేసిందన్నారు. కవిత అడిగినట్లు రూ 14వందల కోట్లు బీఆర్‌ఎస్ పార్టీ ఖాతాలోకి ఎలా వచ్చాయో కేసీ ఆర్ సృష్టత ఇవ్వాలని మంత్రి వివేక్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయంలో దోపిడి రాజ్యామేలిందన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పక్కకు పెట్టిన తా డిచర్ల మైన్ గనులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి తాడిచర్ల బొగ్గుగనిని సింగ రేణి సంస్థకు అప్పజెప్పించిందన్నారు. అది కూడా పెద్దప ల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్రంపై కొట్లాడి ఆయన కృషితో తాడిచర్ల గనిని ఏర్పాటు అయిందని అన్నారు. ముందుగా మాద్యరిపేటలో మాజీ సర్పంచ్ చీటి జ్యోతిసత్యంరావుఇంట్లో పలువురు నేతలు, నాయకులు మంత్రికి కలిసి శాలువతో ఘనంగా సత్కరించారు. అ నంతరం మందమర్రి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు డు బానవత్ నీలయ్య తండ్రి నర్సింహ ఇటీవల మృతి చెందిన నేపధ్యంలో నీలయ్య అతని కుటుంబసభ్యులను మంత్రి వివేక్ పరమర్శించారు. మంత్రి వెంట నాయ కులు బండి సదానందం, దమ్మ సునీల్, మగ్గిడి శ్రీనివా స్, నవీన్, మల్లేష్, నారాయణ, కిషన్, మల్లేష్ పాల్గొన్నారు.