Share News

పారదర్శకంగా చేపట్టాలి

ABN , Publish Date - Jun 25 , 2026 | 11:01 PM

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమం జిల్లాలో ప్రారంభమైం ది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రజల భాగస్వామ్యంతో పారదర్శ కంగా తయారు చేయాలని మహబూబ్‌నగర్‌ జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌, జడ్చర్ల నియోజకవర్గ ఈఆర్వో హరిప్రియ అన్నారు.

పారదర్శకంగా చేపట్టాలి
ఊర్కొండ : ముచ్చర్లపల్లిలో ఓటర్ల దరఖాస్తుల పంపిణీ తీరును పరిశీలిస్తున్న మహబూబ్‌నగర్‌ అడిషనల్‌ కలెక్టర్‌ హరిప్రియ

- ‘సర్‌’పై మహబూబ్‌నగర్‌ అదనపు కలెక్టర్‌ హరిప్రియ

కొల్లాపూర్‌/ ఊర్కొండ/ తిమ్మాజిపేట/ వం గూరు/చారకొండ/ కోడేరు, జూన్‌25 (ఆంధ్రజ్యో తి) : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమం జిల్లాలో ప్రారంభమైం ది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రజల భాగస్వామ్యంతో పారదర్శ కంగా తయారు చేయాలని మహబూబ్‌నగర్‌ జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌, జడ్చర్ల నియోజకవర్గ ఈఆర్వో హరిప్రియ అన్నారు. గురువారం మం డలంలోని ముచ్చర్లపల్లిలో బీఎల్వోలు ఇంటిం టికీ వెళ్లి ఓటరు నమోదు దరఖాస్తుల పంపిణీ తీరును ఆమె పరిశీలించారు. ఆమె మాట్లాడు తూ అర్హత కలిగిన ప్రతీ ఓటరు పేరును ఓట రు జాబితాలో చేర్చాలని, అనర్హుల పేర్లను తొల గించే సమయంలో వారికి సమాచారం అందిం చాలని అన్నారు. తహసీల్దార్‌ యూసుఫ్‌ అలీ, సర్పంచ్‌ ముచ్చర్ల వినీతరెడ్డి, బీఎల్వోలు, నాయ కులు ఉన్నారు.

ఫ కొల్లాపూర్‌ మునిసిపాలిటీ పరిధిలో ఓట ర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ ప్రారంభ మైంది. కొల్లాపూర్‌ తహసీల్దార్‌ మాధ వి నేతృత్వంలో మునిసిపల్‌ పరిధిలోని 4వవార్డు కౌన్సిలర్‌ఎండీఖాదర్‌పాషా, అధికారుల సమక్షంలో ప్రజలకు ఎస్‌ ఐఆర్‌ ఫారాలను అందజేశారు. తహ సీల్దార్‌ మాట్లాడుతూ ఓటర్ల జాబితా లో ఎలాంటి తప్పులు పొరపాట్లకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా ప్రత్యేక సవరణ ప్రక్రియను నిర్వహి స్తున్నట్లు తెలిపారు.

ఫ తిమ్మాజిపేటలో అధికారులు ఎన్యూమ రేషన్‌ ఫారాలు పంపిణీ చేస్తుండగా, తహసీల్దార్‌ జయంతి పరిశీలించారు. ఎన్యూమ రేషన్‌ ఫారాలను బూత్‌లెవల్‌ అధికారులు ఇం టింటికెళ్లి పంపిణీ చేయాలని అన్నారు. మండ లంలోని అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం ప్రారం భమైందని తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్‌ జ్యోతి, గిర్దావర్లు, అధికారులు పాల్గొన్నారు.

ఫ వంగూరు మండలం వెల్మలపల్లి గ్రామం లో ఓటరు ఎన్యూమరేషన్‌ పారాలు పంపిణీ చేశారు. తహసీల్దార్‌ మురళీమోహన్‌ పరిశీలిం చారు. పారదర్శకమైన ఓటరు జాబితా రూపక ల్పనే లక్ష్యంగా ఎస్‌ఐఆర్‌ నిర్వహణ చేపట్టినట్లు ఆయన తెలిపారు. సర్పంచ్‌ రామస్వామి, కాంగ్రె స్‌ మండల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నా రు.

ఫ చారకొండలో తహసీల్దార్‌ ఉమ ఓటర్లకు ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీని ప్రారంభించా రు. ఆయా గ్రామాల్లో బూత్‌ల వారీగా బీఎల్‌వోలు, జీపీవోలు, ఎస్‌ఐఆర్‌ ఓటర్‌ సవరణ కార్యక్రమంలో ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్‌ ఫారాలు అందించారు. ఆర్‌ఐ భరత్‌గౌడ్‌, బీఎల్‌ వోలు, జీపీవోలు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jun 25 , 2026 | 11:01 PM