Share News

kumaram bheem asifabad- క్షేత్ర స్థాయిలో పరిశీలించాలి

ABN , Publish Date - Jul 14 , 2026 | 11:02 PM

ఇందిరమ్మ ఇళ్ల్ల పథకంలో ఎల్‌-1 జాబితాలో ఉన్న కచ్చ ఇళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా నివేదిక అందించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో గృహనిర్మాణశాఖ, ఎంపీడీవోలతో ఎల్‌-1 జాబితాలోని కచ్చ ఇళ్లు గల లబ్ధిదారుల జాబితా పరిశీలన మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల రెండవ విడత కొరకు ఎల్‌-1 జాబితాలో గల కచ్చ ఇళ్లు గల లబ్ధిదారుల వద్దకు వెళ్లి వాస్తవ పరిస్థితులపై విచారణ జరిపి నివేదికలు వెంటనే అందించాలని తెలిపారు. ఏమైన సమస్యలు ఉంటే గృహనిర్మాణశాఖ పీడీ దృష్టికి తీసుకురావాలని ఎల్‌-1 జాబితాలో కచ్చ ఇళ్లుగా నమోదైన లబ్ధిదారుల వివరాల సంఖ్య 2,300 ఉందని చెప్పారు. అందులో ఇప్పటి వరకు 1,800 ఇళ్లు పరిశీలన పూర్తి చేశామని వివరించారు.

kumaram bheem asifabad- క్షేత్ర స్థాయిలో పరిశీలించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిత

ఆసిఫాబాద్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల్ల పథకంలో ఎల్‌-1 జాబితాలో ఉన్న కచ్చ ఇళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా నివేదిక అందించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో గృహనిర్మాణశాఖ, ఎంపీడీవోలతో ఎల్‌-1 జాబితాలోని కచ్చ ఇళ్లు గల లబ్ధిదారుల జాబితా పరిశీలన మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల రెండవ విడత కొరకు ఎల్‌-1 జాబితాలో గల కచ్చ ఇళ్లు గల లబ్ధిదారుల వద్దకు వెళ్లి వాస్తవ పరిస్థితులపై విచారణ జరిపి నివేదికలు వెంటనే అందించాలని తెలిపారు. ఏమైన సమస్యలు ఉంటే గృహనిర్మాణశాఖ పీడీ దృష్టికి తీసుకురావాలని ఎల్‌-1 జాబితాలో కచ్చ ఇళ్లుగా నమోదైన లబ్ధిదారుల వివరాల సంఖ్య 2,300 ఉందని చెప్పారు. అందులో ఇప్పటి వరకు 1,800 ఇళ్లు పరిశీలన పూర్తి చేశామని వివరించారు. ఇంకా 500 ఇళ్ల పరిశీలన పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు. గెజిటెడ్‌ అధికారులు ఇండ్ల పరిశీలన త్వరగా పూర్తి చేయాలని మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల పురోగతి సాదించాలని తెలిపారు. మొదటి విడతలో 9,306 ఇళ్లు మంజూరయ్యాయని అన్నారు. ఇప్పటి వరకు 683 ఇళ్లు పూర్తి చేశారని తెలిపారు. మిగతా ఇళ్లు వివిధ దశల్లో ఉందని తెలిపారు. గృహనిర్మాణశాఖ ఇంజనీరింగ్‌ అధికారులు లబ్ధిదారులతో మాట్లాడి త్వరగా ఇళ్లు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకొవాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు బిల్లులు అందేల చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ చేసుకోవాలని చెప్పారు. ఈనెల 20వ తేదీలోగా ప్రక్రియ పూర్తి చేసుకోవాలని తెలిపారు. సమావేశంలో గృహనిర్మాణశాఖ పీడీ ప్రకాష్‌రావు, ఎంపీడీవోలు, గెజిటెడ్‌ అధికారులు, హౌసింగ్‌శాఖ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 14 , 2026 | 11:02 PM