Share News

kumaram bheem asifabad-మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

ABN , Publish Date - Nov 27 , 2026 | 10:42 PM

కుమరం భీం ఆసిఫాబాద్‌ను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలనికలెక్టర్‌ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సంస్థ ప్రతినిధులతో కలిసి పోస్టర్లను అవిష్కరించారు.

kumaram bheem asifabad-మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
:పోస్టర్లను విడుదల చేస్తున్న కలెక్టర్‌ హరిత, పాల్గొన్న అధికారులు

ఆసిఫాబాద్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం ఆసిఫాబాద్‌ను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలనికలెక్టర్‌ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సంస్థ ప్రతినిధులతో కలిసి పోస్టర్లను అవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నషాముఖ్త్‌ భారత్‌ అభియాన్‌లో భాగంగా జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడినవారు ఆరోగ్యంగా, ఆర్థికంగా క్షిణించి వారి కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని చెప్పారు. యువత మత్తు బారిన పడకుండా రెడ్‌క్రాస్‌ సోసైటీ ఆధ్వర్యంలో గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని తెలిపారు. మత్తు పదార్థాలు, మద్యం, పొగాకు వంటి వాటికి యువత దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధితశాఖల అధికారులు, రెడ్‌క్రాస్‌ సోసైటీ ప్రతినిదులు పాల్గొన్నారు.

ఆహార భద్రత చట్టం పకడ్బందీగా అమలు చేయాలి

జిల్లాలో జాతీయ ఆహార భద్రత చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లు యువరాజ్‌ మర్మాట్‌, డేవిడ్‌లతో కలిసి శుక్రవారం జిల్లాస్థాయి విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశానికి కలెక్టర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ అత్యంత బలహీనవర్గాల వారికి ఆహార భద్రత కార్డు ఒక వరమని తెలిపారు. పేదవారికి ఆహార భద్రతను కల్పించడమే లక్ష్యంగా రూపొందించిన జాతీయ ఆహార భద్రత చట్టాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు విజిలెన్స్‌ కమిటీ సభ్యులు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. ఆహార భద్రత కార్డులకు పంపిణీ చేస్తున్న సన్నరకం బియ్యం నాణ్యతతో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేజీబీవీలు, గురుకులాలు, వసతి గృహలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలకు సరఫరా చేసే బియ్యం నిర్ణీత గడువులోగా అందించాలని చెప్పారు. రాయితీ బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని, డివిజన్‌, మండలస్థాయిలో జాతీయ ఆహార భద్రత చట్టంపై కమిటీ సభ్యులు సమావేశాలు నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీఎస్‌ఓ వాజీద్‌ఖాన్‌, డీడీ జాదవ్‌ అంబాజీ, డీఈవో సచ్చిదానందచారి, సీఈవో లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 27 , 2026 | 10:42 PM