Share News

దళిత ఉప సర్పంచ్‌ను అవమానించడం సరికాదు

ABN , Publish Date - Oct 10 , 2026 | 11:43 PM

దళిత ఉప సర్పంచ్‌ దుబ్బ భాగ్యరాణిని అవమానించ డం సరికాదని ఎమ్మార్పీఎస్‌ జి ల్లా అధ్యక్షుడు రాజు మాదిగ అ న్నారు.

దళిత ఉప సర్పంచ్‌ను అవమానించడం సరికాదు
ఇప్పపహాడ్‌లో నిర్వహించిన ధర్నాలో మాట్లాడుతున్న ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు రాజు మాదిగ

ఊర్కొండ, అక్టోబరు 10 (ఆం ధ్రజ్యోతి) : దళిత ఉప సర్పంచ్‌ దుబ్బ భాగ్యరాణిని అవమానించ డం సరికాదని ఎమ్మార్పీఎస్‌ జి ల్లా అధ్యక్షుడు రాజు మాదిగ అ న్నారు. శనివారం మండలంలోని ఇప్పపహాడ్‌ గ్రామ పంచాయతీ ఎదుట ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఆయన మాట్లా డుతూ వీబీ జీరామ్‌జీ నిధులతో గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి భూమి పూజకు ఏర్పాటు చేసిన శిలాఫలకంపై ఉప సర్పంచ్‌ దుబ్బ భాగ్యరాణి పేరు పెట్టకపోవడంలో అధికారులు ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. దళితులు కావడంతోనే పేరు పెట్టలేదని, అధికారుల తీరును విమర్శిం చారు. నాయకులు నాగేష్‌, రాములు, బాలస్వా మి, మైసయ్య, శ్రీశైలం, అంజిబాబు, బుచ్చ య్య, వెంకటయ్య, హరికృష్ణ ఉన్నారు.

Updated Date - Oct 10 , 2026 | 11:43 PM