పథకాలను నిలిపివేయడం సరైంది కాదు..
ABN , Publish Date - Aug 17 , 2026 | 11:48 PM
కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని నిలిపివేయడం సరైనా పద్ధతి కాదని నస్పూర్‌లోని కలెక్టరేట్ ఎదుట బీఆర్‌ఎస్ నాయకులు సోమవారం ధ ర్నా నిర్వహించారు.
కలెక్టరేట్ ఎదుట బీఆర్‌ఎస్ నాయకుల ధర్నా
నస్పూర్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని నిలిపివేయడం సరైనా పద్ధతి కాదని నస్పూర్‌లోని కలెక్టరేట్ ఎదుట బీఆర్‌ఎస్ నాయకులు సోమవారం ధ ర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు వి జిత్ కుమార్ మాట్లాడుతూ కల్యాణ లక్ష్మి, షాధీ ముబారక్ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ పథకాలను కొ నసాగించపోతే ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. ఈ పథకంపై నమోదైన పిటీషన్‌పై ప్రభుత్వం ఎం దుకు ఆప్పీల్ చేయలేదన్నారు. పథకాన్ని నీరుగార్చేందుకే ప్రభుత్వ పెద్దలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పథకాన్ని సత్వరమే అ మలు చేయని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సయంలో ఇచ్చిన హా మీలను అమలు చేయకుండా డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని వి మర్శించారు. బీఆర్‌ఎస్ నాయకుల ఆందోళన విషయం తెలుసుకుని అదనపు కలెక్టర్ రాములు అక్కడకు చేరుకుని వారితో మాట్లాడారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ గురించి కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి తెలియ జేస్తామని అదనపు కలెక్టర్ రాములు హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. ఈ ఆందోళనలో గుమ్మడి శ్రీనివాస్, అ క్కూరి సుబ్బయ్య, గాదె సత్యం, మెరుగు పవన్ కుమార్, రవీందర్ రెడ్డి, మల్లెత్తుల రాజేంద్రపాణి, రఫీక్, కాటం రాజు, దగ్గుల మధు, ప్రశాంత్, పెట్టం లక్ష్మణ్, కుమార్, హైమద్ పాల్గొన్నారు.