Share News

మాజీ సీఎం కేసీఆర్‌పై కక్ష సాధింపు తగదు

ABN , Publish Date - Feb 01 , 2026 | 11:44 PM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ప్రత్యేక విచారణ బృందం (సిట్‌) నోటీసులు ఇచ్చి, విచారణకు పిలవడాన్ని నిర సిస్తూ, బీఆర్‌ఎస్‌ నాయకులు జిల్లాలో నిరసనలు చేపట్టారు.

మాజీ సీఎం కేసీఆర్‌పై కక్ష సాధింపు తగదు
కల్వకుర్తిలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో ర్యాలీ అనంతరం నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్‌యాదవ్‌

- కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం తప్పదు

- మాజీ ఎమ్మెల్యేలు కల్వకుర్తిలో గుర్క జైపాల్‌యాదవ్‌, కొల్లాపూర్‌లో బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఆందోళన

- సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మల దహనం

కల్వకుర్తి/ కొల్లాపూర్‌/ పెంట్లవెల్లి/ తాడూరు/ తెలకపలి/ అచ్చంపేటటౌన్‌/ ఉప్పునుంతల/ వెల్దండ/ వంగూరు/ చారకొండ/ ఊర్కొండ/ పెద్దకొత్తపలి/ తిమ్మాజిపేట/ లింగాల, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి) : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ప్రత్యేక విచారణ బృందం (సిట్‌) నోటీసులు ఇచ్చి, విచారణకు పిలవడాన్ని నిర సిస్తూ, బీఆర్‌ఎస్‌ నాయకులు జిల్లాలో నిరసనలు చేపట్టారు. జిల్లా కేంద్రంతోపాటు నియోజకవర్గ సెంటర్లు, వివిధ గ్రామాల్లో గులాబీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని నాయకులు మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 60 ఏళ్ల కలను సాకారం చేసిన మాజీ సీఎం కేసీఆర్‌కు సీట్‌ నోటీస్‌ ఇచ్చి, విచారణకు పిలవడంపై వారు మండిపడ్డారు. కేసీఆర్‌పై కాంగ్రెస్‌ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని నాయకులు మండిపడ్డారు.

ఫ కల్వకుర్తి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్‌ యాద వ్‌, మాజీ మునిసిపల్‌ చైర్మన్‌ ఎడ్మ సత్యం ఆధ్వర్యంలో ఆదివారం బీఆర్‌ఎస్‌ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు, నల్ల కండువాలు ధరించి బారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేడ్కర్‌ విగ్రహా నికి వారు పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ ప్ర భుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్ర మంలో బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు భావండ్ల మధు, మాజీ ఎంపీ పీ కొండూరు గోవర్ధన్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. ఫ కొ ల్లాపూర్‌లో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో బీ ఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థాని క బస్టాండ్‌ సెంటర్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసూ త సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. రాస్తారోకో చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ మునిసిపల్‌ మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫ పెంట్లవెల్లితో పాటు జటప్రోలు, మల్లేశ్వరం తదితర గ్రా మాలలో మాజీ సర్పంచు రాజేశ్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పోతుల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సీఎం రేవం త్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఫ తాడూరుతో పాటు గ్రామా ల్లో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఫ తెలకపల్లిలోని వివే కానంద చౌరస్తాలో గ్రంథాలయం మాజీ చైర్మన్‌ హనుమంతు రావు, నాయకుడు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ర్యాలీ నిర్వహించారు. ఫ అచ్చంపేట పట్టణంతో పాటు మండలంలోని అంకిరోనిపల్లి గ్రామంలో బీఆర్‌ఎస్‌ నా యకులు ఆందోళనలు నిర్వహించారు. సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. బీఆర్‌ఎస్‌ నాయకులు సతీష్‌, బాలు, నరేష్‌ ఉన్నారు. ఫ ఉప్పునుంతలలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కొత్త రవీందర్‌రావు ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహిం చారు. నాయకులు గోపాల్‌రెడ్డి, సర్పంచ్‌ మున్యానాయక్‌, నాయకు లు ఉన్నారు. ఫ వెల్దండలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు జూపల్లి భాస్కర్‌రావు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి రాస్తారోకో నిర్వహించారు. మాజీ ఎంపీపీ రాంరెడ్డి, వెంకట య్యగౌడ్‌, సర్పంచ్‌ కొండల్‌ యాదవ్‌, నాయకులు పాల్గొన్నారు. ఫ వంగూరులో మాజీ మునిసిపల్‌ చైర్మన్‌ నర్సింహ్మగౌడ్‌, బీఆర్‌ఎస్‌ మాజీ మండల అధ్యక్షుడు కోట్ల నరేందర్‌రావు ఆధ్వర్యంలో బ్యాంక్‌ చౌరస్తాలో నోటికి నల్లగుడ్డలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఫ చారకొండలో చారకొండ సర్పంచ్‌, బీఆర్‌ఎస్‌ నాయకుడు గుండె విజేందర్‌గౌడ్‌, ఉప సర్పంచ్‌ కీసరి మల్లేష్‌, పట్టణ అధ్యక్షుడు సవారి శ్రీనివాసులుగౌడ్‌, బీఆర్‌ఎస్‌ మండల ఇన్‌చార్జి బొడ్డు శ్రీశైలం ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఫ ఊర్కొండలోని కల్వకుర్తి-జడ్చర్ల ప్రదాన రహదారిపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. రాస్తారోకో నిర్వహించగా పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వీరారెడ్డి, మాజీ సర్పంచులు మ్యాకల శ్రీనివాసులు, కృష్ణగౌడ్‌ ఉన్నారు. ఫ పెద్దకొత్తపల్లి సర్పంచ్‌ బెట్టరి రేణుకానాగరాజు ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి అంబేడ్కర్‌ చౌరస్తాలో ఆందోళన చేపట్టి, ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. దేవునితిర్మలాపూర్‌నూ బీఆర్‌ఎస్‌ నాయకులు నిరసన చేపట్టారు. పిల్లి పల్లవి, శేఖర్‌, కాకం రమేష్‌, మాజీ జడ్పీటీసీ సభ్యుడు ఎస్‌.వెంకటయ్య, మాజీ సర్పంచ్‌ జక్కుల నరసింహ పాల్గొన్నారు. ఫ తిమ్మాజిపేట అంబేడ్కర్‌ చౌరస్తాలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో దహనం చేశారు. ఫ లింగాలలో సింగిల్‌ విండో మాజీ చైర్మన్‌ జంబుల ఆనంద్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ కోనేటి తిరుపతయ్య, సర్పంచ్‌ శ్రీనివాసులు, ఉప సర్పంచ్‌ వీరాస్వామి ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు.

Updated Date - Feb 01 , 2026 | 11:44 PM