Share News

ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి మంజూరు చేయడం హర్షణీయం

ABN , Publish Date - May 06 , 2026 | 11:50 PM

మంచిర్యాల టూ టౌన్‌ ప్రాం తానికి రైల్వే ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి ప్రధాని మోదీ మంజూరు చేయడం హర్షణీ యమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి పేర్కొన్నారు.

ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి మంజూరు చేయడం హర్షణీయం
మాట్లాడుతున్న రఘునాథ్‌ వెరబెల్లి

మంచిర్యాల కలెక్టరేట్‌, మే 6 (ఆంధ్రజ్యోతి) : మంచిర్యాల టూ టౌన్‌ ప్రాం తానికి రైల్వే ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి ప్రధాని మోదీ మంజూరు చేయడం హర్షణీ యమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి పేర్కొన్నారు. బు ధవా రం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రైల్వే ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి మంజూరు చేయాలని పలుమార్లు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజ య్‌కు, సౌత్‌ సెంట్రల్‌ రైల్వే జీఎంకు వినతి పత్రాలు అందించామన్నారు. దీం తో రైల్వే అధికారులు సుమారు రూ. 4 కోట్లతో గత ఏడాది ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి మంజూరు చేశారన్నారు. ఈ నేపధ్యంలో రైల్వే అధికారులు మంచిర్యాల ము న్సిపల్‌ కమిషనర్‌కు బుధవారం నో ఆబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ కోసం లేఖ రాయడం తో వెంటనే ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి క్లియరెన్స్‌ కోసం నో ఆబ్జెక్షన్‌ సర్టిఫి కెట్లు మంజూరు చేయాలని కోరామన్నారు. ఈ బ్రిడ్జి పూర్తయితే వేల మంది ప్రజలకు ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. ప్రధాని మోదీ అన్ని వర్గాల సం క్షేమానికి కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ము కేష్‌గౌడ్‌, అనిత, నాగరాజు, పురుషోత్తం జాజు, వెంకటేశ్వర్‌రావు, రాజ్‌కుమార్‌, ప్రేమ్‌ సింగ్‌, వెంకటేష్‌, తరుణ్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2026 | 11:50 PM