Share News

బొందల గడ్డగా ఐటీ హబ్‌ ..!

ABN , Publish Date - Sep 28 , 2026 | 11:41 PM

ఇండ స్ట్రియల్‌ పార్క్‌, ఐటీ హబ్‌ కోసం కేటాయించిన స్థలం బొందల గడ్డగా మారింది. అక్రమంగా చేపడుతున్న మ ట్టి తవ్వకాల కారణంగా స్థలంలో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద గుంతలు దర్శనమిస్తున్నాయి.

బొందల గడ్డగా ఐటీ హబ్‌ ..!

-యంత్రాల సహాయంతో జోరుగా మట్టి తవ్వకాలు

-రాత్రుళ్లు ప్రాంతాలకు అక్రమ రవాణా

-తరుచుగా తవ్వకాలతో ఏర్పడ్డ భారీ గుంతలు

-చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు

మంచిర్యాల, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఇండ స్ట్రియల్‌ పార్క్‌, ఐటీ హబ్‌ కోసం కేటాయించిన స్థలం బొందల గడ్డగా మారింది. అక్రమంగా చేపడుతున్న మ ట్టి తవ్వకాల కారణంగా స్థలంలో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద గుంతలు దర్శనమిస్తున్నాయి. కొద్ది రోజులుగా రా త్రివేళల్లో భారీ యంత్రాల సహాయంతో గుట్టు చప్పుడు కాకుండా తవ్వకాలు జరుపుతున్న గుర్తు తెలియని వ్య క్తులు పెద్ద మొత్తంలో మట్టిని లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఐటీ హబ్‌ శం కుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకం స మీపంలోనే అక్రమ తవ్వకాలు జరుగుతుండటం గమ నార్హం. మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని వేంపల్లి, పోశంపహాడ్‌ శివారులో తెలంగాణ ఇండస్ట్రి యల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఆధ్వ ర్యంలో దత్తసాయి ఇండస్ట్రియల్‌, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాల జీతోపా టు ఆటోనగర్‌ పార్క్‌ ఏర్పాటు చేసేందుకు 292 ఎకరా ల స్థలాన్ని రైతుల నుంచి భూసేకరణ ద్వారా కేటాయించారు.

పరిశ్రమల ఏర్పాటు సమయంలోనే....

ఇండస్ట్రియల్‌, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీతోపాటు ఆటో నగర్‌ పార్క్‌ ఏర్పాటుకు స్థలం కేటాయింపులు పూర్తి కావడంతో త్వరలో పరిశ్రమలు స్థాపించే వ్యాపారులకు భూములు అప్పగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నా యి. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌ రావు ప్రత్యేక శ్రద్దతో పురుడు పోసుకున్న భారీ ప్రాజెక్టు ద్వారా వందలాది మంది నిరుద్యోగ యువతకు ప్రత్య క్షంగా ఉద్యోగాలు లభించనుండగా, పరోక్షంగా అనేక మందికి ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభించనున్నా యి. జిల్లాలో ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఇండస్ట్రి యల్‌, ఐటీ హబ్‌ పార్కు లేకపోగా తొలిసారిగా మంచిర్యాల నియోజక వర్గంలోనే దానికి అంకురార్పణ జరిగింది. ఇండస్ట్రియల్‌ పార్క్‌కు గత ఏడాది జూలై 13న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పరిశ్ర మలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శంకు స్థాపన చేశారు. ఈ తరుణంలోనే మట్టి తవ్వకాలు కలకలం రేపుతున్నాయి.

గుట్టుగా మట్టి తవ్వకాలు....

ఇండస్ట్రియల్‌, ఐటీ పార్కు కోసం కేటాయించిన భూముల్లోని సర్వే నంబర్‌లు 154, 155, 159లలో అక్ర మంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. ప్రతిరోజూ రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఎక్సకావేటర్ల సహాయంతో తవ్వకాలు జరుపుతూ లారీల ద్వారా పెద్ద మొత్తంలో మట్టిని తరలిస్తున్నారు. సదరు స్థలం జనావాసాలకు దూరంగా ఉండటం, అటవీ ప్రాం తాన్ని ఆనుకొని ఉండటంతో రెవెన్యూ, మైనింగ్‌ అధికా రుల దృష్టి దానిపై పడటం లేదు. ప్రత్యేకంగా పని కో సం వెళ్లేవారు మినహా అటువైపు రాత్రివేళల్లో దాదాపు ప్రజలు వెళ్లే అవకాశాలు అరుదు. పగటిపూట సైతం పశువుల కాపర్లు, పరిసరాల్లో వ్యయసాయం చేసే వా రు తప్ప ఇతరుల సంచారం చాలా తక్కువగా ఉంటుం ది. ఈ పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటున్న అక్రమార్కులు పెద్ద ఎత్తున తవ్వకాలు జరుపుతుం డగా, ఆ ప్రదేశంలో భారీ గుంతలు ఏర్పడ్డాయి. అధికా రుల దృష్టిని మళ్లించేందుకు మద్య మద్యలో కొంత విరామం ఇచ్చి మళ్లీ తవ్వకాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

రియల్‌ వెంచర్లకు తరలింపు...

ఇండస్ట్రియల్‌, ఐటీ హబ్‌ కోసం కేటాయించిన స్థలం లో మెత్తటి మొరంతో కూడిన నాణ్యమైన మట్టి లభి స్తుంది. ఆ మట్టిని రోడ్ల నిర్మాణంతోపాటు లోతుగా ఉ న్న ప్రాంతాల్లో నింపడానికి ఉపయోగిస్తే వర్షాకాలం లోనూ బురదమయం కాకుండా ఉంటుంది. శిలాఫలకం చుట్టూ ఉన్న ప్రాంతమంతా గతంలో బొందలు, గుం తలుగా ఉండేది. ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటు సంద ర్భంగా స్థలాన్ని చదును చేశారు. దీంతో అక్కడికి వాహ నాలు వెళ్లేందుకు అవకాశం ఏర్పడింది. దీన్ని ఆసరగా మలుచుకున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు తవ్వకాలు జరు పుతున్నారు. ఈ ప్రాంతంలో లభించే మట్టి ఒక్కో లారీ ట్రిప్పు రూ. 8 వేల వరకు ధర పలుకుతోంది. అలా నిత్యం 20 నుంచి 30 లారీల్లో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. ఇండస్ట్రియల్‌ పార్కు ప్రాంత మంతా ప్రస్తుతం భారీ గుంతలు ఏర్పడగా, ప్రభుత్వ ఖజనాకు రాయల్టీ రూపంలో పెద్ద మొత్తంలో గండి పడుతోంది. ఐటీ పార్కు కోసం వ్యాపారులకు స్థలాలు అప్పగించాల్సి ఉన్నందున మట్టి తవ్వకాల వల్ల ఆ ప్రాంతంలో ఏర్పడ్డ భారీ గుంతలను తిరిగి పూడ్చాల్సి ఉంటుందనే వ్యా ఖ్య లు వినిపిస్తున్నాయి. దాని కోసం పెద్ద మొత్తంలో మ ట్టి అవసరం కాగా, ఇతర ప్రాంతాల నుంచి తరలిం చాల్సి వస్తుందని, అందుకు పెద్ద మొత్తంలో ఖర్చు కూ డా అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహిరిస్తుండటం అనుమానాలకు దారి తీస్తోంది. ఇప్పటికైనా భూగర్భ గనులు, రెవెన్యూ శాఖల అఽధికారులు స్పందించి, అక్రమ మట్టి రవాణాను తక్షణమే అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Sep 28 , 2026 | 11:41 PM