Share News

kumaram bheem asifabad-సూచనలిస్తూ..హడలెత్తించి..

ABN , Publish Date - Jul 14 , 2026 | 11:04 PM

బెజ్జూరు మండలంలో పర్యటనకు వచ్చిన అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌ పలు సూచనలు చేస్తూ అధికారులను హడలెత్తించారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీని మంగళవారం ముందుగా సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. ఆయా రికార్డులను పరిశీలిస్తూ పంచాయతీ పరిదిలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. గ్రామపంచాయతీ ద్వారా ఎక్కడెక్కడ పనులు చేశారో రికార్డులు చూస్తూ తనిఖీ చేశారు.

kumaram bheem asifabad-సూచనలిస్తూ..హడలెత్తించి..
: వైద్యులతో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌

బెజ్జూరు, జూలై 14 (ఆంధ్రజ్యోతి): బెజ్జూరు మండలంలో పర్యటనకు వచ్చిన అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌ పలు సూచనలు చేస్తూ అధికారులను హడలెత్తించారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీని మంగళవారం ముందుగా సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. ఆయా రికార్డులను పరిశీలిస్తూ పంచాయతీ పరిదిలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. గ్రామపంచాయతీ ద్వారా ఎక్కడెక్కడ పనులు చేశారో రికార్డులు చూస్తూ తనిఖీ చేశారు. ఆ తర్వాత జిల్లా పరిషత్‌ సెకండరీ పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. తొమ్మిదో తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్బంగా స్వాతంత్య్ర ఉద్యమం ఎలా జరిగింది, ఎందుకు చేశారు అంటూ ప్రశ్నించి విద్యార్థుల నుంచి జవాబులు రాబట్టారు. కుమరం భీం దేనికోసం పోరాటం చేశారు, ఎవరిపై పోరాడారు అంటూ విద్యార్థులను ప్రశ్నించి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు. అనంతరం కస్తూర్బా, గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. ఆయా పాఠశాలల్లో గదులు ఉరుస్తున్నాయని, నూతన భవనాలకు నిధులు మంజూరు చేయించాలని కోరగా నివేధికను ప్రభుత్వానికి పంపిచి నిధులు మంజూరుకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్బంగా మండల కేంద్రంలోని సామాజిక ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఆసుపత్రిలో సరైన వైద్యసేవలు అందుతున్నాయా? వైద్యులు అందుబాటులో ఉంటున్నారా? అని రోగులను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసిబ్బంది స్థానికంగా ఉంటూ రోగులకు వైద్య సేవలు అందించాలని సూచించారు. అడిషనల్‌ కలెక్టర్‌ అన్ని శాఖలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ అధికారులను హడలెత్తించారు. ఇంకా ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తెస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రజలతో చెప్పారు. ఆయన వెంట ఎంఈవో సునీత, హెచ్‌ఎం మారుబాయి, ఎస్‌వో అరుణ, సర్పంచ్‌ దుర్గం సరోజ తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 14 , 2026 | 11:04 PM