kumaram bheem asifabad- కౌలు రైతులకు ఏదీ భరోసా?
ABN , Publish Date - Apr 30 , 2026 | 10:29 PM
భూములు కౌలుకు తీసుకొని పంటలు సాగు చేస్తు న్న రైతుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. సొంత భూమి లేకపోయిన ఏళ్లుగా కౌలు తీసుకుని వ్యవసాయమే జీవనాధారంగా కుటుం బాలను పోషించుకుంటున్నారు. వాతావరణ పరిస్థితులు, ప్రభుత్వ విధానాలు కౌలుదారులను నష్టాల ఊబి లోకి నెడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను అదుకునేందుకు అనేక చర్యలు తీసుకుం టున్నా అవేవీ కౌలు రైతులకు వర్తించకపోవడంతో ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది.
- ఆరుగాలం శ్రమించినా దక్కని ఫలాలు
- అడ్డగోలుగా పెరిగిన కౌలు, పెట్టుబడులు
- జిల్లాలో 30 వేల మంది కౌలు రైతులు
ఆసిఫాబాద్‌రూరల్, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): భూములు కౌలుకు తీసుకొని పంటలు సాగు చేస్తు న్న రైతుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. సొంత భూమి లేకపోయిన ఏళ్లుగా కౌలు తీసుకుని వ్యవసాయమే జీవనాధారంగా కుటుం బాలను పోషించుకుంటున్నారు. వాతావరణ పరిస్థితులు, ప్రభుత్వ విధానాలు కౌలుదారులను నష్టాల ఊబి లోకి నెడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను అదుకునేందుకు అనేక చర్యలు తీసుకుం టున్నా అవేవీ కౌలు రైతులకు వర్తించకపోవడంతో ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. నిబంధనల ప్రకారం కౌలురైతులను గుర్తించి వారికి రుణ ఆర్హతకార్డులు అందజేసి బ్యాంకుల ద్వారా రుణాలు అందించాలి. కానీ ప్రభుత్వం ఆధికార యంత్రాంగం దృష్టి సారించక పోవడంతో ఎలాంటి సహకారానికి నోచుకోవ డంలేదు. జిల్లాలో ఎకరానికి దాదాపు రూ. 15వేల నుంచి రూ. 30 వేల వరకు కౌలు చెల్లిస్తు న్నారు. పంట దిగుబడితో సంబంధం లేకుండా కౌలు చెల్లించాల్సిన పరిస్థితి ఉండడం, మద్దతు ధర లేకపో వడం వంటి ఇబ్బందులతో కౌలుదారులు నష్టపోతున్నారు. కొన్ని సందర్భాల్లో పెట్టిన పెట్టుబడి సైతం రాక అప్పులపాలవుతున్నారు.
- జిల్లా వ్యాప్తంగా..
జిల్లాలోని 15 మండలాల పరిధిలో సుమారుగా 30వేల వరకు కౌలు రైతులు న్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, ఇతరత్రా రంగాలకు చెం దిన వారు వ్యవసాయం చేసే ఆసక్తి లేక పోవడంతో పాటు సాగు కష్టాలను ఎదర్కొనే పరిస్థితులు లేకపోవడంతో తమ భూములను కౌలుకు ఇచ్చేస్తుం టారు. ప్రభుత్వం అందించే పెట్టుబడి సహయం పట్టాదారు రైతుల ఖాతాల్లోనే జమవుతూ వచ్చింది. దీంతో పంటను సాగు చేసిన కౌలు రైతు పేరే ఎక్కడా లేకుండా పోయింది. గత ప్రభుత్వం అందిం చిన రైతు బంధులో కౌలు రైతు ఊసే లేకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. పంటలు సాగు చేసి ఎరువులు, కలుపులు తీయాల్సిన పరిస్థితుల్లో పెట్టుబడి కోసం ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం అదే పరిస్థితి నెలకొంది. బ్యాంకులు కూడా కౌలు రైతులకు రుణాలు ఇవ్వడం లేదు.
- సంక్షేమ పథకాలకు నోచుకోక..
కౌలుదారులకు ఎక్కడా ఆధికారిక గుర్తింపు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల ను అందుకోలేకపోతున్నారు. కాంగ్రెస్‌పార్టీ అధికారం లోకి వస్తే కౌలు రైతులకు రైతుభరోసా ఇస్తామని హామీ ఇచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఆచరణలోకి తీసుకురాలేదు. కౌలు రైతులకు బ్యాంకుల్లో రుణాలు ఇవ్వకపోవడంతో వడ్దీ వ్యాపారుల నుంచి రుణాలు తీసుకొని సాగుకు ఉపక్రమిస్తున్నారు. గత యాసంగి సమయంలో ఎరువులు సైతం బుకింగ్ ద్వారా ఇవ్వ డంతో కౌలు రైతులు ఎరువులు ఆధిక ధరకు కొను గోలు చేయాల్సి వచ్చింది. ఇప్పటికైనా కౌలుదారులను గుర్తించి అన్ని రకాల సాయం అందేలా చూడాలని కోరుతున్నారు.
- పెరుగుతున్న ఖర్చులు..
రోజురోజుకూ పంట పెట్టుబడులు పెరుగుతున్నా యి. ఒక ఎకరంలో పత్తి పంట వేయాలంటే సుమారుగా రూ. 25వేలు, వరి పొలానికి రూ. 23 నుండి 25 వేలు, మొక్కజొన్న చేనుకు రూ. 20వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. కౌలు డబ్బులు కాకుం డా కౌలు కుటుంభీకుల కష్టం పోను విత్తనాలు, ఎరువులకే అధిక పెట్టుబడి వెచ్చించా ల్సిన పరిస్థితి. ఎంత కష్టపడినప్పటికీ ఎకరానికి 10వేల నుండి 15వేల వరకు మిగిలే పరిస్థితి లేదు. 2018 నుంచి రైతు బంధు అమలు చేయగా అప్పటి నుండి కౌలు రైతులకు ఎదో ఒక రూపకంగా ప్రభుత్వం సాయం చేయాలన్న డిమాండ్ ఉన్నది.
- పంట అమ్ముకునేందుకు సైతం..
కౌలు రైతులు తాము పండించిన పంటను అము ్మకోవడానికి సైతం తిప్పలు పడుతున్నారు. పట్టాదా రు కల్గిన రైతులే అమ్ముకోవడానికి వీలు ఉండడం తో కౌలు రైతులు తక్కువ ధరకే దళారులకు విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే కౌలు రైతు లను గుర్తించి ప్రత్యేక గుర్తింపు కార్డులు అందజేసి బ్యాంకుల నుంచి రుణాలు అందేలా చూడాలని పలువురు కోరుతున్నారు. రైతు భరోసా పథకం రూ. 15వేల సాయం వర్తింపజేయాలని దీంతో కొంత మేర రైతులు నష్టపోకుండా ఉంటారని ప్రభుత్వం త్వరగా కౌలు రైతులపై విధివిధానాలు రూపొందించాలని పలువురు కోరుతున్నారు.