kumaram bheem asifabad- ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కలేనా..
ABN , Publish Date - Aug 24 , 2026 | 10:54 PM
కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో ఏళ్లుగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి నోచుకోవడం లేదు. సమీకృత మార్కెట్ కోసం గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ ఇంకా నిర్మాణానికి నోచుకోలేదు. నిధులు మంజూరయి ఏండ్లు గడిచి పోతున్నా కూడా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం తో మార్కెట్ నిర్మాణం జరగడం లేదని అంటున్నారు.
- రోడ్డుపైనే కూరగాయల విక్రయాలు
- వ్యాపారులకు తప్పని అవస్థలు
కాగజ్‌నగర్ టౌన్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో ఏళ్లుగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి నోచుకోవడం లేదు. సమీకృత మార్కెట్ కోసం గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ ఇంకా నిర్మాణానికి నోచుకోలేదు. నిధులు మంజూరయి ఏండ్లు గడిచి పోతున్నా కూడా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం తో మార్కెట్ నిర్మాణం జరగడం లేదని అంటున్నారు. గత 2020లో ప్రభుత్వం కాగజ్‌గనర్ మున్సిపాలిటీకి 5.2 లక్షలు నిధులు మంజూరు చేసిందని, అయితే అప్పటి పాలకవర్గం ఆధ్వర్యంలో అధికారులు స్థల సేకరణ కోసం పలు స్థలాలను పరిశీలించారు. కాగజ్‌నగర్ శివారులోని స్థలాన్ని పరిశీలించి భూమి పూజ చేపట్టారు. తద నంతరం పలు కారణాలతో అక్కడి నుంచి ఏదైనా వేరే చోటికి తరలించి నిర్మాణం కొనసా గించాలని నిర్ణయించారు. అనంతరం తిరిగి కొన్నేళ్లుగా ఉలుకు పలుకు లేకుండానే గడిచింది.
- వినియోగదారులకు సౌలభ్యం..
వినియోగదారులకు సౌలభ్యం కలిగేలా పూలు, పం డ్లు, తాజా కూరగాయలు ఒకే చోట విక్రయించడంతో పాటు మరోవైపు మాంసం, చికెన్, చేపలు, తదితర నాన్‌వెజ్‌ల విక్రయాలకు ప్రత్యేక ఏర్పాట్లు వీటిలో ఉంటాయి. తద్వారా పేదలకు ఉపాధి అవకాశాలతో పాటు వినియోగదారులకు సౌలభ్యంగా ఉంటుందన్న ఉద్దేశంతో సమీకృత మార్కెట్ నిర్మాణాలకు నిధులు మంజూరు చేశారు. సమీకృత మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పటికీ తిరిగి స్థలం సమస్య వచ్చిం ది. దీంతో అది నేటికి పూర్తి కాలేదు. కాగజ్‌నగర్‌తో పాటు నియో జకవర్గం, మండలంలోని అనేక గ్రామాల నుంచి వ్యాపారులు నిత్యం కాగజ్‌నగర్ వస్తుంటారు. దీంతో వందలాది మంది పేదలు కూరగాయలను ఎక్కడపడితే అక్కడే ఎండలో ఎండుతూ వానలో తడుస్త్తూనే అమ్మకాలు కొనసాగించాల్సిన దుస్థితి నెలకొంది. నిధులు మంజూరు అయ్యాక ఎన్నికలు రావడంతో నిధులు మూలుగుతుండి పోయాయి. ఇదే అవకాశంగా భావించిన అధికారులు నిధులు ఇతరత్ర పనులకు వినియోగించారని ఆరోపణలున్నాయి. కోట్లాది రూపాయల నిధులు విడుదల అయినప్పటికీ నిర్మాణాలు చేపట్టలేదు. ఈ నిర్మాణాలు పూర్తయితే కాగజ్‌నగర్‌లో కూరగాయలు, మాంసం, చేపలు, ఇతరత్ర పూర్తి స్థాయి మార్కెట్ అన్ని హంగులతో ఏర్పడేది. కానీ పనులు కొనసాగకపోవడంతో పెండింగ్‌లో ఉండిపోయింది. మార్కెట్ నిర్మాణం కోసం స్థలం సేకరించే విషయంలో అప్పటి పాలకవర్గం సైతం ఆర్ అండ్‌బి, ఈఎస్‌ఐ భూమితో పాటు పలు స్థలాలను పరిశీలించింది. ఆఖరుకు శంకుస్థాపన చేసిన చోటు కాకుండా ఆర్‌అండ్‌బి గెస్ట్ హౌజ్ సమీపంలోని భూమిని ఫైనల్ చేస్తూ అధికా రులు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆర్‌అండ్‌బి గెస్ట్‌హౌస్ పురాతనమైనదని ఆ స్థలంలో నిర్మాణం చేపట్టేందుకు అనుమతులు తీసుకున్నారు. గెస్ట్‌హౌస్ కూల్చివేస్తే ఆ స్థలం అనుకూలంగా ఉంటుందని లేఖ రాయడంతో అనుమతి కూడా వచ్చిందని అప్పటి అధికారులు ప్రకటించినా కొలిక్కి రాలేదు.
- పట్టణంలో ప్రధానంగా..
కాగజ్‌నగర్ పట్టణంలో ప్రధాన మార్కెట్ అయిన ఇందిరా కూరగాయల (పెద్ద) మార్కెట్‌తో పాటు సర్‌సిల్క్‌లో చిన్న మార్కెట్‌లో కూరగాయల విక్ర యాలు కొనసాగుతున్నాయి. వీటిలో క్రయ, విక్రయా లకు అనుకూలంగా లేదనే ప్రధాన రోడ్లమీద కూర గాయలు, ఇతరత్ర వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. దీం తో ట్రాఫిక్ సమస్య ఏర్పడి పోలీసులు, మున్సిపల్ అధి కారులు మార్కెట్‌లోనే విక్రయాలు జరపాలని వారికి సూచిస్తు, రోడ్డు పక్కల నుంచి ఖాళీ చేయించడంతో సమస్య ఏర్పడి వాగ్వాదం జరిగింది. దీంతో సర్‌సిల్క్ కూరగాయల మార్కెట్‌లో వ్యాపారులు ఽకూరగాయలు రోడ్డుపై పారబోసి ఇటీవల ధర్నా, నిరసన చేపట్టారు. ఇందిరా కూరగాయల మార్కెట్‌లో అమ్మకాలు సాగడం లేదని, ఎల్‌బీఎస్ మార్కెట్‌లో మార్కెట్‌లో స్థలం కబ్జాకు గురి కావడం, వ్యాపారానికి స్థలం అనువుగా లేనందునే రోడ్డుపైనే విక్రయిం చాల్సి వస్తోంది. అ యితే నిధులు ఏళ్లుగా మూలుగుతున్నా కూడా మార్కె ట్ నిర్మాణం జరగక పోవడంతో చిరు వ్యాపారులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. నూతనంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్మాణ పనులు చేయాలని అధికా రులు భావించినా కూడా నేటికీ కార్యరూపం దాల్చలే దు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవ త్సరాలు దాటినా నేటికి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం కలగానే మిగిలిపోయింది. ఇప్పటికైనా చర్యలు తీసుకొని చిరు వ్యాపారులకు అన్ని ఒకే చోట ఉండే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించాలని కోరుతున్నారు.