పునరావాసం వట్టి మాటలేనా?
ABN , Publish Date - Apr 17 , 2026 | 10:59 PM
వా రంతా మాజీ మావోయిస్టులు...మావోయిస్టు ఉద్యమంలో వివిధ కేడర్లలో పనిచేశారు. ప్రభు త్వ పిలుపు మేరకు ఉద్యమాన్ని వదిలి జన జీవన స్రవంతిలో కలిశారు. లొంగిపోయిన మా వోయిస్టులకు నిబంధనల మేరకు ప్రభుత్వం తరుపున రివార్డులతోపాటు పునరావాసం కోసం ఇంటి స్థలం, ఐదెకరాల సాగుభూమి ఇవ్వాల్సి ఉంది.
మాజీ మావోయిస్టులకు అందని ప్రభుత్వ సాయం
సాగు కోసం అటవీ భూములు అప్పగింత
వాటిలోకి రాకుండా అడ్డుకుంటున్న అటవీ అధికారులు
ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం శూన్యం
మంచిర్యాల, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): వా రంతా మాజీ మావోయిస్టులు...మావోయిస్టు ఉద్యమంలో వివిధ కేడర్లలో పనిచేశారు. ప్రభు త్వ పిలుపు మేరకు ఉద్యమాన్ని వదిలి జన జీవన స్రవంతిలో కలిశారు. లొంగిపోయిన మా వోయిస్టులకు నిబంధనల మేరకు ప్రభుత్వం తరుపున రివార్డులతోపాటు పునరావాసం కోసం ఇంటి స్థలం, ఐదెకరాల సాగుభూమి ఇవ్వాల్సి ఉంది. రివార్డులు సక్రమంగానే ఇచ్చినప్పటికీ ఇంటి స్థలాలు, సాగు భూముల పంపిణీ విష యంలో తమకు అన్యాయం జరిగిందని వారి బాధలు ఏకరువు పెడుతున్నారు. ఈ విషయ మై మంచిర్యాల జిల్లాకు చెందిన 29 మంది మాజీ మావోయిస్టులు ఈ నెల 13వ తేదీన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌కు వేర్వేరుగా లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేశారు. జనజీ వన స్రవంతిలో కలిసిన తమకు ఇంటి స్థలాలు, సాగుభూములు ఇవ్వలేదని, దీంతో నిరుద్యోగు లుగా మిగిలిపోయి కడు బీద పరిస్థితులను ఎదుర్కొంటున్నామని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొందరికి ప్రభుత్వం భూములు ఇచ్చినప్పటికీ పట్టాలు జారీ చేయకపోగా, మరికొందరికి ప ట్టాలు ఇచ్చి భూములు చూపకపోవడంతో ఇ బ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన భూములు ఫారెస్ట్ స్థలాలు కావడంతో సాగు చేసేందుకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఇది లా ఉండగా, ఏ ఆధారమూ లేని తమను ఇప్ప టికైనా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
ఫ పట్టా ఇచ్చి...భూమి మరిచారు...
తాండూరు మండలం కాసిపేట గ్రామానికి చెందిన మాజీ దళ సభ్యురాలు గుండారపు కిష్ట క్క అలియాస్ లలిత 2018లో లొంగిపోయిం ది. ఆమెకు ఐదెకరాల భూమి చూపించినప్పటి కీ, హద్దులు పెట్టకపోవడం, పట్టా ఇవ్వక పోవ డంతో ఇతరుల కబ్జాలోకి భూమి వెళ్లిపోయింది. అప్పటినుంచి ఆమె కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
ఫ అటవీ భూములు ఇవ్వడంతో ఇబ్బందులు....
మందమర్రికి చెందిన గాదె రాములు అలి యాస్ గోపన్న 2002లో సరెండర్‌కాగా, బెల్లం పల్లి మండలంలోని ఆకెనపల్లి శివారులో ఐదెక రాల భూమి చూపించారు. పట్టా కూడా జారీ చేశారు. ఇతను అందులో సాగు చేసుకుంటు న్నాడు. ఇటీవల అటవీ అధికారులు సదరు భూమి తమ పరిధిలోనిది అని, అతన్ని అ డ్డుకొని కేసులు నమోదు చేయడంతో కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు.
ఫ మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన అ రిగెల పద్మ అలియాస్ సునీత మావోయిస్టు పార్టీలో దళ సభ్యురాలిగా పనిచేశారు. ఆమె 1999లో లొంగిపోయారు. ఆమె భర్త అరిగెల వెంకాగౌడ్ అలియాస్ ప్రతాప్ దళ కమాండర్ గా పని చేశారు. దంపతులు ఇద్దరూ పార్టీ నుంచి బయటకు రావడంతో భర్త పేరిట ఇంటి స్థలం, జీవనోపాధి కోసం మునిసిపల్ షట్టర్ ఇ చ్చారు. ఇంటి స్థలం, మున్సిపల్ షట్టర్‌ను అ మ్ముకొని ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. దీంతో ప ద్మ ముగ్గురు ఆడపిల్లలతో కలిసి జీవనం సాగి స్తోంది. ఆమెకు ప్రభుత్వపరంగా ఎలాంటి సహాయం అందలేదు.
ఫ సాగు చేయనీయడం లేదు...
క్యాతం రవికుమార్ అలియాస్ ఫిల్టర్‌బెడ్ రవి
మందమర్రికి చెందిన నేను సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస)లో సెంట్రల్ ఆర్గనైజర్‌గా ప ని చేసి, 1991లో లొంగిపోయాను. నాకు 1999 లో ప్రభుత్వం స్వచ్ఛందంగా లేఖ రాసి దరఖా స్తు చేపించింది. దీంతో అప్పటి అధికారులు నాకు జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామ శివా రులో 2008లో ఐదెకరాలు ఇవ్వగా, సా గుచే స్తూ జీవనం సాగిస్తున్నాను. అనంతరం తెలం గాణ ప్రభుత్వం పట్టా పాసు పుస్తకం సైతం జారీ చేసింది. రైతుబంధు కూడా తీసుకుంటు న్నాను. 2019 నుంచి అటవీ అధికారులు సదరు భూమిలో సాగు చేయకుండా అడ్డుకోవడ మేగా క కేసులు నమోదు చేయగా, కోర్టు చుట్టూ తి రుగుతున్నాను. ప్రభుత్వం కేసులు మాఫీ చేసి, మరోచోట భూమి కేటాయించాలి.
ఫ భూమి ఇచ్చి, పట్టా మరిచారు...
- రాగుల లక్ష్మి అలియాస్ స్వరూప
చెన్నూరు మండలం ఆస్నాద్ గ్రామానికి చెందిన నేను దళ సభ్యురాలిగా పనిచేసి 1999 లో లొంగిపోయాను. నాకు సొంత గ్రామంలో ఐదెకరాల స్థలం ఇచ్చారు. అందులో బోరు ని ర్మించి, సాగు చేసుకుంటున్నాను. అయితే భూ మి ఇచ్చిన అధికారులు పట్టా జారీ చేయకపో వడంతో అటవీ అధికారులు భూమి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విష యం మంత్రి గడ్డం వివేకానంద దృష్టికి సైతం తీసుకెళ్లాను. నాకు పట్టా జారీ చేసి, ఆదుకోవాలి.