Share News

పోషకాహారం అందేనా...?

ABN , Publish Date - Oct 23 , 2026 | 11:50 PM

పేద, మద్యతరగతి ప్రజల్లో పోషకాహార లోపాన్ని నివారించేం దుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫోర్టిఫైడ్‌ రైస్‌ (బలవర్దక బియ్యం) పంపిణీకి కాలం చెల్లనుందా..? అంటే ఔననే సమాధానాలే వినిపిస్తున్నాయి.

పోషకాహారం అందేనా...?

-నిలిచిన బలవర్దక బియ్యం సరఫరా

-రేషన్‌ షాపులకు ఫోర్టిఫైడ్‌ రైస్‌ చేరేది అనుమానమే

-వచ్చే నెల నుంచి సాధారణ బియ్యమే దిక్కు..!

-జిల్లాలో 2,19,453 ఆహార భద్రత కార్డులు

మంచిర్యాల, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): పేద, మద్యతరగతి ప్రజల్లో పోషకాహార లోపాన్ని నివారించేం దుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫోర్టిఫైడ్‌ రైస్‌ (బలవర్దక బియ్యం) పంపిణీకి కాలం చెల్లనుందా..? అంటే ఔననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఇప్పటికే అంగన్‌వాడీ కేంద్రాల్లో ఫోర్టిఫైడ్‌ రైస్‌ పిల్లలకు అంది స్తుండగా, ప్రతినెలా రేషన్‌ షాపుల ద్వారా పంపిణీ చే స్తున్న బియ్యాన్ని ఫోర్టిఫైడ్‌గా మార్చి ప్రజలకు పౌష్టికా హారం అందజేయాలనే సదుద్దేశ్యంతో కేంధ్ర ప్రభుత్వం 2023 ఏప్రిల్‌లో పథకాన్ని ప్రవేశపెట్టింది. ఫోర్టిఫైడ్‌లో భాగంగా ఐరన్‌, విటమిన్‌ డి, బీ -12తో పాటు మరిన్ని పోషక విలువలతో కూడిన బియ్యాన్ని చౌక ధరల దుకా ణాల ద్వారా అందజేయాలని నిర్ణయించింది. ఇంత కా లం పాటు ఫోర్టిఫైడ్‌ రైస్‌ సక్రమంగానే పంపిణీ జరి గినప్పటికీ ఇక మీదట అది సాధ్యపడేలా లేదు. గత రెండు నెలలుగా ఫోర్టిఫైడ్‌ రైస్‌ తయారీ నిలిచిపోగా, స్టాకు ఉన్నంత వరకే పంపిణీ చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే నెల బియ్యం కోటా లో ఫోర్టిఫైడ్‌కు బదులు సాధారణ రకమే రేషన్‌ షాపుల ద్వారా పంపిణీ అయ్యే అవకాశాలు అనేకం కనిపిస్తున్నాయి.

ఫోర్టిఫైడ్‌ రైస్‌లో పోషకాలు...

ప్రస్తుతం పంపిణీ చేస్తున్న పీడీఎస్‌ బియ్యాన్నే పోషక విలువలు కలిగి ఉండేలా తయారు చేస్తారు. ఫోర్టిఫైడ్‌ రైస్‌లో ఐరన్‌, విటమిన్‌ డి, బీ-12తోపాటు మ రిన్ని పోషకాలు ఉండేలా కేంద్రం ఏర్పాట్లు చేసింది. గోదుమలు, మినుములు, పెసర, రాగులు, సజ్జలు వం టి తృణ దాన్యాలను పొడిగా మార్చి వాటిని బియ్యం పరిమాణంలో గింజలుగా చేస్తారు. వాటిని సాధారణ బియ్యంతో కలిపి సరఫరా చేస్తారు. బియ్యంలో ఉండే పిండి పదార్థాలతోపాటు ఈ గింజలను కలపడం ద్వా రా పోషకాలు మిలితమై రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చాలా ప్రాంతాల్లో పోషకాహారలోపంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నరు. ముఖ్యంగా గర్భి ణుల్లో పోషకాహార లోపం వల్ల పిల్లలు వివిధ లోపా లతో పుడుతున్నారు. పోషకాహార లోపాన్ని నివారిం చేలా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని సీఎంఆర్‌ కోసం మి ల్లులకు ప్రభుత్వం ఇస్తుంది. రైస్‌ మిల్లుల్లో ధాన్యాన్ని మేలు రకం బియ్యంగా మార్చి ఆ బియ్యంలో ఫోర్టిఫైడ్‌ గింజలను కలుపుతారు. ఒక క్వింటా బియ్యంలో కిలో ఫోర్టిఫైడ్‌ గింజలను కలిపి అవి పూర్తిస్థాయిలో బి య్యంతో కలిసేలా ఏర్పాట్లు చేస్తారు.

స్టాకు ఉన్నంత వరకే పంపిణీ...

చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు పోషకాహార లో పంతో బాధపడకుండా ఉండేందుకు కేంధ్ర ప్రభు త్వం ఫోర్టిఫైడ్‌ రైస్‌ను పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. 2024 నాటికి దేశంలోని అన్ని రేషన్‌ షా పుల ద్వారా పేద ప్రజలకు ఈ బియ్యాన్ని అందించేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఫోర్టిఫైడ్‌ రైస్‌ తయారీకి పోషకాలు కలిగిన వివిధ రకాల ఆహార గింజలను కేంధ్రమే సీఎమ్మార్‌ అనుమతులు పొందిన రైస్‌ మిల్లులకు సరఫరా చేస్తోంది. దాన్యాన్ని మిల్లింగ్‌ చేసే సమయంలో బియ్యంలో ప్రత్యేకమైన గింజలు కల పడం ద్వారా ఫోర్టిఫైడ్‌ చేసేలా కేంఽధ్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో మూడేళ్లపాటు సజావుగానే సాగిన ఫో ర్టిఫైడ్‌ రైస్‌ పంపిణీకి ఇప్పడు బ్రేకులు పడే పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్రం నుంచి పోషక విలువలుగల గిం జల సరఫరా గతకొద్ది రోజులుగా నిలిచిపోయిందని మి ల్లర్లు చెబుతున్నారు. పౌరసరఫరాలశాఖ అధికారులు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నారు. వర్షాకాలం నే పథ్యంలో రేషన్‌ షాపుల్లో లబ్ధిదారులకు ఒకేసారి మూడు నెలలపాటు బియ్యం పంపిణీ చేపట్టగా, ఈ నెలతో ముగియనుంది. ఇకమీదట ఏనెలకానెల బియ్యం పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రేషన్‌ షాపుల ద్వారా లబ్దిదారులకు సన్నబి య్యం పంపిణీ జరుగుతోంది. వచ్చే నెల కోటాలో ఫో ర్టిఫైడ్‌ రైస్‌ స్టాకు ఉన్నంత వరకు పంపిణీ చేసి, మి గతాది సాధారణ బియ్యం పోసే అవకాశాలు ఉన్నట్లు పౌరసరఫరాలశాఖ అధికారులు చెబుతున్నారు.

జిల్లాలో 3080 మెట్రిక్‌ టన్నులు పంపిణీ...

జిల్లాలో ప్రతినెలా 423 రేషన్‌ దుకాణాల్లో 2 లక్షల 19వేల 453 ఆహార భద్రత కార్డుల ద్వారా మొత్తం 3080.327 మెట్రిక్‌ టన్నుల పీడీఎస్‌ బియ్యం సరఫరా జరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల వి ద్యార్థులు, అంగన్‌వాడీ కేంద్రాలకు సైతం పీడీఎస్‌ బి య్యాన్నే సరఫరా చేస్తున్నారు. ఫోర్టిఫైడ్‌ రైస్‌ను చౌక ధరల దుకాణాల ద్వారా ఆహార భద్రత కార్డుదారులకు ఒక్కొకరికీ ఆరు కిలోలు, అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోలు, అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోల చొ ప్పున పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్త రేషన్‌ కా ర్డుల పంపిణీ జరిగినందున వాటిపైనా అర్హతగల వా రందరికీ ఫోర్టిఫైడ్‌ రైస్‌ అందాల్సి ఉండగా, గోదాము ల్లో స్టాకు నిల్వలు అడుగంటుతున్నందన నాన్‌ ఫో ర్టిఫైడ్‌ రైసే అందే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - Oct 23 , 2026 | 11:51 PM