గూడెం ఎత్తిపోతలతో సాగునీరు అందించాలి
ABN , Publish Date - Jan 13 , 2026 | 12:11 AM
శ్రీసత్యనారాయణస్వామి ఎత్తిపోతల పథకం నుంచి ఆయకట్టు రెండో పంటకు సాగునీరు తక్షణమే విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు డిమాండ్ చేశారు.
మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు
దండేపల్లి జనవరి 12 (ఆంధ్రజ్యోతి): గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఎత్తిపోతల పథకం నుంచి ఆయకట్టు రెండో పంటకు సాగునీరు తక్షణమే విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన గూడెం లిప్ట్‌ను సోమ వారం పార్టీ నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. ఆయన మాట్లాడు తూ గూడెం ఎత్తిపోతల పథకం దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండ లాలకు ఒక జీవనాధారమన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉండడం వల్లనే 2015లో గూడెం వద్ద మూడు టీఎంసీల గూడెం లిప్ట్ మంజూరు చేశామన్నారు. ఒకవైపు రైతులు యాసంగి పంటల సాగు కోసం ఇప్పటికే వరినారు వేసి సాగుకు సిద్ధమవుతున్న ఇప్పటి వరకు సాగునీరు విడుదలపై అధికా రులు ప్రకటనలు చేయడం లేదన్నారు. గూడెం ఎత్తిపోతల పథకం నుంచి ఆయకట్టు పంటలకు తక్షణమే సాగునీరు విడుదల చేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో లక్షెట్టిపేట మున్సిపాలిటి మాజీ చైర్‌పర్సన్ నల్మాస్ కాంతయ్య, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య, దం డేపల్లి. లక్షెట్టిపేట మండలాల పార్టీ అధ్యక్షులు చుంచు శ్రీనివాస్, చిన్నయ్య, మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ పాల్గొన్నారు.