Share News

గోదాముల్లో గోల్‌మాల్‌...!

ABN , Publish Date - Sep 29 , 2026 | 11:43 PM

అది పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్‌ బియ్యం నిలువ ఉంచే ఎంఎల్‌ఎస్‌ (మండల లెవల్‌ స్టాకిస్టు) పాయింట్‌. మంచి ర్యాల మండలంలోని 142 చౌక ధరల దుకాణాలకు పంపి ణీ చేసే బియ్యాన్ని ఆ గోదాములో నిల్వ చేస్తారు.

గోదాముల్లో గోల్‌మాల్‌...!

-మళ్లీ రేషన్‌ బియ్యం మాయం..?

-మంచిర్యాల ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో వరుస ఘటనలు

-గతంలో రూ. 16 లక్షలు, తాజాగా 34 క్వింటాళ్లు పక్కదారి

-ఇంటి దొంగలపైనే అనుమానాలు..?

మంచిర్యాల, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): అది పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్‌ బియ్యం నిలువ ఉంచే ఎంఎల్‌ఎస్‌ (మండల లెవల్‌ స్టాకిస్టు) పాయింట్‌. మంచి ర్యాల మండలంలోని 142 చౌక ధరల దుకాణాలకు పంపి ణీ చేసే బియ్యాన్ని ఆ గోదాములో నిల్వ చేస్తారు. అక్కడి నుంచి నెలనెలా రేషన్‌ షాపులకు బియ్యం సరఫరా అవు తాయి. ఏ నెల ఎంత స్టాకు గోదాముకు వస్తుంది....అక్కడి నుంచి ఏ షాపులకు ఎంత సరుకు పంపిణీ జరిగింది... ఎంత మిగిలి ఉంది అనే సమాచారం పక్కాగా ఉంటుంది. గోదాం ఇన్‌చార్జి బియ్యం లెక్కలు ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేస్తుండాలి. ఇంత పకడ్బంధీ వ్యవస్థ ఉన్నప్పటికీ, అక్కడ పనిచేసే కొందరు తమ చేతివాటం ప్రదర్శిస్తు న్నారు. ఫలితంగా లక్షలు విలువ చేసే పేదల బియ్యం పక్కదారి పడుతున్నాయి. మంచిర్యాల ఎంఎల్‌ఎస్‌ పాయిం ట్‌లో గతంలో దాదాపు 500 క్వింటాళ్లకు పైబడి బియ్యం మాయం కాగా, తాజాగా అదే గోదాము నుంచి ఈ నెల 21వ తేదీన 34 క్వింటాళ్లను డీసీఎం వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తుండగా, లక్షెట్టిపేట పోలీసులు పట్టుకోవడం జిల్లా లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎప్పటికప్పుడు నిల్వ లు పరిశీలించి, అవసరమైన చర్యలు చేపట్టవలసిన పౌర సరఫరాల శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే పేదలకు చెందా ల్సిన బియ్యం పక్కదారి పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇంటి దొంగల పనేనా...?

మంచిర్యాల గోదాము నుంచి వరుసగా బియ్యం పక్కదారి పడుతుండటం వెనుక ఇంటి దొంగల పనేనన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పేదలకు బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో భారాన్ని భరి స్తున్నాయి. అయినప్పటికీ కిందిస్థాయి అఽధికారులు, సిబ్బం ది నిర్లక్ష్యం కారణంగా పేదలకు చెందాల్సిన బియ్యం పక్క దారి పడుతున్నాయి. గతంలో గోదాము నుంచి సుమారు రూ. 16 లక్షల విలువైన 500 పైచిలుకు క్వింటాళ్ల బియ్యం మాయంకాగా ’గోదాములో గోల్‌మాల్‌’ శీర్షికన ’ఆంధ్రజ్యో తిలో 2022 జనవరి 29న కథనం ప్రచురితం అయింది. దీంతో విచారణ జరిపిన అప్పటి జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూధన్‌ నాయక్‌ ఇంటి దొంగల పనిగా తేల్చారు. దీంతో అప్పటి గోదాం ఇంచార్జిపై సస్పెన్షన్‌ వేటు వేశారు. తాజాగా 34 క్వింటాళ్ల బియ్యం పక్కదారి పట్టిన సంఘ టనలో కూడా ఇంటి దొంగల హస్తమే ఉన్నట్లు జిల్లా ఉన్న తాధికారులు భావిస్తున్నారు. గోదాముకు ఎప్పుడు ఎంత బియ్యం చేరింది... ప్రస్తుతం ఉన్న స్టాకు ఎంత అనే విష యాలపై పూర్తిస్థాయిలో లెక్కలు తీస్తున్నట్లు సమాచారం.

సీఎంఆర్‌ భర్తీ కోసమేనా...?

తాజాగా బియ్యం పక్కదారి పట్టడం వెనుక కొందరు రైస్‌ మిల్లర్ల పాత్ర ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగు తోం ది. గతంలో సీఎంఆర్‌ (కస్టం మిల్లింగ్‌ రైస్‌) కింద ధాన్యం తీసుకుని డిఫాల్టర్‌గా మారిన మిల్లర్లు ఆ లోటు భర్తీ చే సేందుకు నానా తంటాలు పడుతున్నారు. కొంతకాలం పా టు ఇతర రాష్ట్రాల నుంచి బియ్యం కొనుగోలు చేసి గుట్టు చప్పుడు కాకుండా భర్తీ చేసేందుకు ప్రయత్నించగా, తాజా గా ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల ఇచార్జిలతోనే బేరసారాలు కుదు ర్చుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో నే మంచిర్యాల గోదాం నుంచి డీసీఎం వ్యాన్‌ ద్వారా లక్షె ట్టిపేట వైపు ఉన్న ఓ రైస్‌ మిల్లుకు ధాన్యం తరలిస్తూ పో లీసులకు పట్టుబడ్డట్లు తెలుస్తోంది. పోలీసులు వ్యాన్‌ డ్రై వర్‌తో సహా మరొకరిపై కేసు నమోదు చేశారు. అయితే రైస్‌ మిల్లు యజమాని ఎవరు...? అతనిపై ఎలాంటి చర్య లు చేపడతారోనన్న చర్చ జోరుగా సాగుతోంది. మరోవైపు లక్షెట్టిపేట ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జే మంచిర్యాల గో దాం బాధ్యతలు కూడా నిర్వహిస్తుండటం, బియ్యం మా యం వెనుక ఎవరి పాత్ర ఉందనే సందేహాలు వ్యక్తమవు తున్నాయి. ఇదిలా ఉండగా ప్రతినెల మధ్యాహ్న భోజనం నిర్వహణ కోసం ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కస్తూర్బా వసతి గృహాలకు ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి బియ్యం సరఫరా అవుతాయి. విద్యార్థుల సంఖ్యకు సరిపడా బియ్యం సరఫరా అవుతున్నప్పటికీ, గైర్హా జరు కారణంగా ప్రతినెల కొంత మొత్తం మిగులు తుం దని, అలా మిగులు సరుకును మరుసటి నెలకు వా డుకొ ని, ఆ నెలలో తీసుకోవలసిన కోటాను ఎంఎల్‌ఎస్‌ పా యింట్ల వద్దనే అమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. అలా ఎం ఎల్‌ఎస్‌ పాయింట్లలో అక్రమంగా కొనుగోలు చేస్తున్న బి య్యాన్నే అదను చూసుకొని అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారన్న అరోపణలు ఉన్నాయి.

నిష్పక్షపాత విచారణ జరిగేనా...?

మంచిర్యాల ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి బియ్యం మాయం కావడం జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ త తంగం విషయంలో పై అధికారుల విచారణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రేషన్‌ బియ్యం గోల్‌మాల్‌ విషయం లో అధికారులు సంపూర్ణ విచారణ జరిపితే తప్ప అసలు దోషులు పట్టుబడే అవకాశం లేదు. కాగా ఏదోలా మేనేజ్‌ చేసి, జిల్లా ఉన్నతాధికారుల దృష్టి మరల్చే ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నట్లు ప్రచారం. ఈ క్రమంలో గోదా ములో పని చేసే ఓ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిని బాధ్యుడిని చే యడం ద్వారా విచారణ ముగించేందుకు ప్రయత్నం జ రుగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా నిష్పక్షపాతంగా విచారణ జరిపి బియ్యం నిల్వలు మాయం కావడానికి కారకులెవరో తేల్చాల్చిన బాధ్యత అఽధికారులపై ఉంది.

Updated Date - Sep 29 , 2026 | 11:43 PM