kumaram bheem asifabad- ఉపాధి హామీ రికార్డుల్లో అవకతవకలు
ABN , Publish Date - Nov 04 , 2026 | 10:09 PM
మండలంలోని బాలాజీ అనుకోడ రైతు వేదికలో నిర్వహించిన ఐదో విడత సామాజిక తనిఖీ ప్రజావేదికలో రికార్డుల్లో అవకతవకలు గుర్తించడంతోగ్రామ పంచాయతీ కార్యదర్శులపై డీఆర్‌డీవో దత్తారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
చింతలమానేపల్లి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బాలాజీ అనుకోడ రైతు వేదికలో నిర్వహించిన ఐదో విడత సామాజిక తనిఖీ ప్రజావేదికలో రికార్డుల్లో అవకతవకలు గుర్తించడంతోగ్రామ పంచాయతీ కార్యదర్శులపై డీఆర్‌డీవో దత్తారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2025కు సంబంధించిన ఉపాఽధి హామీ పథకం పనులు, మొక్కల పెంపకం, పింఛన్లు ఇతర అభివృద్ధి పనులకు సంబంధించిన రికార్డుల్లో పలు తప్పులు, వ్యత్యాసాలు ఉండడంతో ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులను నిలదీశారు. ఉపాధి హామీ పనుల్లో రెండు రోజులు పని చేసిన కూలీలకు నాలుగు రోజుల హాజరు నమోదు చేసి డబ్బులు తీసుకున్నారా..? ఆరు రోజులు పని చేస్తే ఏడు రోజుల హాజరు ఎలా వేశారు..? అంటూ రికార్డులను పరిశీలిస్తూ ప్రశ్నించారు. ఉపాధి హామీ పనుల్లో పని చేయకున్నా, కూలీ ఫొటోలు తీయకుండా ఆ కూలి యొక్క అకౌంటులో ఎలా డబ్బులు ఎలా వేసి తీశారని గ్రామ పంచాయతీ కార్యదర్శుల సంతకాలు లేకుండా ఉపాధి హామీ పనులకు సంబంధించిన బిల్లులు ఎలా చెల్లించారని ఫీల్డు అసిస్టెంట్లను ప్రశ్నించినట్టు తెలిసింది. గ్రామాల్లో నాటిన మొక్కల సంరక్షించక ఎండిపోవడం ఫించన్లకు సంబంధించిన వివరాలు, ఇతర రికార్డుల నిర్వహణల లోపాలపై కార్యదర్శులను నిలదీశారు. ప్రభత్వు నిధుల వినియోగంలో నిర్లక్ష్యం వహించకుండా ప్రతి పనికి సంబంధించిన రికార్డులను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. సామాజిక తనిఖీల్లో గుర్తించిన లోపాలపై సంబంధిత సిబ్బంది వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యనారాయణ, ఎపీఓ సోయిబ్, ఎస్‌టీఎం, ఎస్‌ఆర్‌పి పాండురంగ్, ఈసీఎస్ సంతోష్, అనిల్ ప్లాంటేషన్ మేనేజర్, స్బిబంది పాల్గొన్నారు.