kumaram bheem asifabad- దేశీదారుపై ఉక్కుపాదం
ABN , Publish Date - Jul 24 , 2026 | 11:17 PM
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా మీదుగా మహారాష్ట్ర నుంచి జరుగుతున్న దేశీదారు అక్రమ రవాణాపై ఎక్సైజ్‌శాఖ ఉక్కుపాదం మోపింది. గతంలో జిల్లాలోని పలు ప్రాంతాలకు మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున దేశీదా రు తరలించే వారు. ముఖ్యంగా కాగజ్‌నగర్ పట్టణం నుంచి మహారాష్ట్రకు నేరుగా రైల్వే మార్గం ఉండ డంతో అక్రమ రవాణా దారులు ఈ మార్గాన్నే ఎక్కు వగా వినియోగించే వారు. కానీ ఎక్సైజ్ అధికారులు పక్కా నిఘా ఏర్పాటు చేసి ప్రత్యేక తనిఖీలు చేపట్టడంతో అక్రమ రవాణాకు గణనీయంగా తగ్గింది.
- అడ్డుకట్ట వేసేందుకు ఎక్సైజ్, పోలీస్ అధికారుల పక్కా నిఘా
- ఏడాదిలోపే రూ.20లక్షల విలువైన మద్యం స్వాధీనం
కాగజ్‌నగర్, జూలై 24 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా మీదుగా మహారాష్ట్ర నుంచి జరుగుతున్న దేశీదారు అక్రమ రవాణాపై ఎక్సైజ్‌శాఖ ఉక్కుపాదం మోపింది. గతంలో జిల్లాలోని పలు ప్రాంతాలకు మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున దేశీదా రు తరలించే వారు. ముఖ్యంగా కాగజ్‌నగర్ పట్టణం నుంచి మహారాష్ట్రకు నేరుగా రైల్వే మార్గం ఉండ డంతో అక్రమ రవాణా దారులు ఈ మార్గాన్నే ఎక్కు వగా వినియోగించే వారు. కానీ ఎక్సైజ్ అధికారులు పక్కా నిఘా ఏర్పాటు చేసి ప్రత్యేక తనిఖీలు చేపట్టడంతో అక్రమ రవాణాకు గణనీయంగా తగ్గింది. కాగజ్‌నగర్‌కు దిగుమతి చేయకుండా ఎక్సైజ్ సీఐ రవి కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది నిఘా పెట్టి ఈ దందాకు బ్రేక్‌లు వేశారు. కాగా గతంలో దేశీదారు అక్రమ రవాణా చేస్తూ పట్టుబడి మళ్లీ అదే దందాను కొనసాగిస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. అలాంటి వారిపై బైండోవర్ కేసులు నమోదు చేయడంతో పాటు ఒక్కరికి రూ.లక్ష వరకు జరి మానా విఽధించారు. దీంతో అక్రమ రవాణాకు పాల్ప డాలంటేనే అక్రమార్కులు వెనుకంజ వేస్తున్నారు. మహారాష్ట్రలో తయారయ్యే దేశీదారుకు తక్కువ ధరలో ఎక్కువ మత్త వస్తుందనే కారణంతో కొందరు మద్యం ప్రియులు ఇప్పటికీ దానిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ డిమాండును ఆసరాగా చేసుకొని కొందరు అక్రమ రవాణాకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలతో వారి ప్రయత్నాలు విఫలమవుతున్నాయి.
- పకడ్బందీ నిఘా..
జిల్లాలో అక్రమ మద్యం రవాణాను పూర్తిగా అరిక ట్టేందుకు ఎక్సైజ్ శాఖ ఆధునిక నిఘా వ్యవస్థను వినియోగిస్తూ, రహస్య సమాచారంతో పక్కాగా దాడులను కొనసాగిస్తోంది. ప్రజలు కూడా అక్రమ మద్యం విక్రయాలు లేదా రవాణా గురించి సమాచా రం అందించిన వెంటనే తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. దీంతో ఒకప్పుడు జోరుగా సాగిన దేశీదారు దందా ప్రస్తుతం గణనీయంగా తగ్గినట్టు స్పష్టమవుతోంది. ఇప్పటి వరకు చేసిన దాడుల్లో 600 లీటర్ల దేశీదారు బాటిళ్లను పట్టుకున్నారు. అలాగే 64 కేసులు నమోదు చేశారు. నివారణ కోసం ప్రతి రోజు బైండోవర్ కేసులు చేస్తామని దందాదారులకు ఎక్సైజ్ సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో అవగా హన కార్యక్ర మాలు చేపడుతున్నారు. గతంలో బైండోవర్ చేసినప్ప టికీ మళ్లీ అమ్మకాలు జరిపినా ఇద్దరిపై రూ.2లక్షలు జరిమానా విఽధించారు. జిల్లాకు మహారాష్ట్రకు వెళ్లే మార్గాలపై రాత్రి వేళల్లో షిప్టుల వారిగా ఎక్సైజ్ సిబ్బంది నిఘా పెడుతున్నారు. రైలు మార్గం, రోడ్డు మార్గం ద్వారా ఈ దందాను జరుగకుండా కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటున్నారు.
ప్రణాళికాబద్ధంగా నిఘా..
- ఎక్సైజ్ సీఐ రవికుమార్, కాగజ్‌నగర్
మహారాష్ట్ర కేంద్రంగా కొనసాగే దేశీదారు దందాపై పక్కాగా ప్రణాళికాబద్ధంగా నిఘా పెట్టాం. రైలు, రోడ్డు మార్గం ద్వారా షిప్టుల వారీగా సిబ్బందితో రాత్రి వేళల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాం. నిఘా వ్యవస్థ సమాచారం వచ్చిదంటే రాత్రి వేళల్లోనే దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. ఇందులో ఏ ఒక్కరిని కూడా ఊపేక్షించడం లేదు. బైండోవర్ చేసినా మళ్లీ ఈ దందా చేస్తున్న వారిపై రూ.2లక్షల వరకు జరిమానా విధించాం.