Share News

ఉక్కు మహిళ ఇందిర

ABN , Publish Date - Oct 31 , 2026 | 11:21 PM

పేదరికం నిర్మూలన కృషి చేసిన ఉక్కు మహిళ ఇందిరా గాంధీ అని అ చ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ్ణ అన్నారు.

ఉక్కు మహిళ ఇందిర
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ

- మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతిలో ఎమ్మెల్యే వంశీకృష్ణ

అచ్చంపేటటౌన్‌/ కొల్లాపూర్‌/ అమ్రాబాద్‌/ మన్ననూర్‌/ ఊర్కొండ/ తెలకపల్లి, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి) : పేదరికం నిర్మూలన కృషి చేసిన ఉక్కు మహిళ ఇందిరా గాంధీ అని అ చ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ్ణ అన్నారు. భారత మాజీ ప్రధాని, దివంగత ఇందిరా గాంధీ వర్థంతి సందర్భంగా శనివారం అచ్చంపేట పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ని వాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ హ రిత విప్లవం, పేదరిక నిర్మూలనకు కృషి చేసిన ఉక్కు మహిళా నాయకురాలు అని కొనియాడా రు. ఆమె ఆశయ సాధన కోసం కృషి చేయాల్సి అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమం లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేందర్‌, ఖా దర్‌, కాశన్న యాదవ్‌ పాల్గ్గొన్నారు.

కొల్లాపూర్‌లో డీసీసీ ఉపాధ్యక్షుడు రంగినేని జగదీశ్వరుడు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పిం చారు. మహిళలకు వస్త్రాలు, పండ్లు పంపి ణీ చేశారు. అడ్వకేట్‌ మధుసూదన్‌రావు, ఎండీ జమీల్‌ అహ్మద్‌ఖాన్‌, వెంకటస్వా మి, స్వామి పాల్గొన్నారు.

అమ్రాబాద్‌లో కాంగ్రెస్‌ నాయకులు ఇందిరాగాంధీ చిత్ర పటానికి పూల మాల లు వేసి నివాళులర్పించారు. మన్ననూర్‌లో మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ జూలూరి సత్యనా రాయణ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ చిత్రప టానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళు లర్పించారు. ఉమామహేశ్వర ఆలయ పాలక మండలి డైరెక్టర్‌ సంభు శోభ, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ఎంఏ రహీం, నాయకులు సంభు వెంకట్‌రమణ, వెంకటయ్య పాల్గొన్నారు.

ఊర్కొండలో కాంగ్రెస్‌ మండల పార్టీ అధ్యక్షు డు అయూబ్‌పాషా, సర్పంచుల సంఘం మండ ల అధ్యక్షుడు రమేష్‌నాయక్‌ ఆధ్వర్యంలో ఇంది రాగాంధీ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. భారతదేశానికి ఆ మె చేసిన సేవలను వారు కొనియాడారు. దేవా లయ చైర్మన్‌ చింతల మనోహర్‌రెడ్డి, సర్పంచు అబ్దుల్‌ రషీద్‌, ఆదినారాయణ ఉన్నారు.

తెలకపల్లిలో గ్రామ సర్పంచ్‌ చంద్రశేఖర్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ యాదయ్య ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

Updated Date - Oct 31 , 2026 | 11:21 PM