‘ఐపీఎల్ ప్రిడిక్షన్’ మాయలో పడొద్దు: సజ్జనార్
ABN , Publish Date - Apr 08 , 2026 | 05:18 AM
ఐపీఎల్ వేళ బెట్టింగ్ మాయగాళ్ల వలలో పడవద్దని హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. ‘ఐపీఎల్ ప్రిడిక్షన్’ పేరిట కొందరు సోషల్ మీడియాలో...
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): ఐపీఎల్ వేళ బెట్టింగ్ మాయగాళ్ల వలలో పడవద్దని హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. ‘ఐపీఎల్ ప్రిడిక్షన్’ పేరిట కొందరు సోషల్ మీడియాలో ‘టాస్ ఎవరు గెలుస్తారో.. ఏ జట్టు గెలుస్తుందో ముందే తెలుసుకోండి. మా ఛానల్‌ను సబ్‌స్ర్కైబ్ చేసుకోండి’ అంటూ మోసపూరిత ప్రకటనలు గుప్పిస్తున్నారని తెలిపారు. ఇలా యువతను బెట్టింగ్‌లోకి లాగుతున్నారని చెప్పారు. డబ్బు కోసం కొంత మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా ఈ ప్రకటనల గురించి ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఇలాంటి పెయిడ్ ప్రమోషన్ల విషయంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం కఠినంగా వ్యవహరిస్తోందని, నెల రోజుల్లోనే 494 పెయిడ్ ప్రకటనలను, వాటిని ప్రచారం చేస్తున్న 129మంది సోషల్ మీడియా ప్రొఫైళ్లను బ్లాక్ చేయించామని తెలిపారు.